Nivetha Thomas: క్యూట్ క్యూట్ లుక్ తో కవ్విస్తున్న నివేద థామస్.. స్వీట్ 35 లుక్స్ తో..!

Nivetha Thomas Viral Photos: నివేదా థామస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటనపరంగా తనకంటూ ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. తాజాగా నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు సినిమా.. సెప్టెంబర్  ఐదున విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..

1 /5

నాని జెంటిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు.. పరిచయమైన హీరోయిన్ నివేదా థామస్. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ముఖ్యంగా నటన పరంగా వందకి వంద మార్కులు వేయించుకుంది. 

2 /5

ఆ తరువాత తెలుగులో వరస సినిమాలు అందుకుంటూ దూసుకుపోయింది. మళ్లీ నానితో నటించిన నిన్ను కోరి చిత్రం కూడా.. నివేదా థామస్ కు మంచి విజయం అందించింది. గ్లామరస్ హీరోయిన్ గా కాకుండా.. నటన పరంగా ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ వెళ్ళింది ఈ నటి. 

3 /5

అందుకే ఈ హీరోయిన్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 35:చిన్న కథ కాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ హీరోయిన్.

4 /5

ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా ఎంతో చక్కటి నటన ప్రదర్శించింది. సెప్టెంబర్ ఐదున విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో..దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా కోసం కాస్త బొద్దుగా తయారయ్యింది నివేదా థామస్. 

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. బొద్దుగా ఉన్న ఎంతో ముద్దుగా కనిపిస్తూ.. క్యూట్ క్యూట్ లుక్స్ తో.. చీరలో మెరిసిపోతూ అభిమానులను ఫిదా చేస్తోంది ఈ భామ.