Car Safety: ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏ దొంగ ఎత్తుకుపోలేడు.. మీ కారు ఎప్పటికీ భద్రం

To Secure Your Car From Theft These Tips Follow: కుటుంబం కోసం ఎంతో దోహదం చేసేది కారు. ఎంతో కష్టపడి కొన్న కారును దొంగతనం కాకుండా ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు. దొంగల నుంచి మన కారు సురక్షితంగా ఉంటుంది. ఈ కొన్ని చిట్కలు చూడండి కారును భద్రంగా కాపాడుకోండి.

1 /6

Car Safety Tips: తాళం చెవిలను కారు లోపల కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. అదనపు కీలు ఉండడం చాలా సురక్షితం. ఎక్కడైనా పోగొట్టుకుపోయినా.. మరచిపోయినా అదనపు తాళాలు చాలా మేలు చేస్తాయి.

2 /6

Car Safety Tips: కారు లోపల విలువైన వస్తువులను ఉంచవద్దు. కారులో విలువైన వస్తువులు ఉంటే దొంగలు ఆకర్షితులవుతారు. కారులో ఎలాంటి వస్తువులు పెట్టవద్దు.

3 /6

Car Safety Tips: కారు కొన్న వెంటనే జీపీఎస్‌ ట్రాకర్‌ను ఏర్పాటుచేసుకోవాలి. జీపీఎస్‌ ట్రాకర్‌ ఉంటే కారు దొంగతనానికి గురయిన వెంటనే వెతికి పట్టుకోవచ్చు. మీ కారుకు వెంటనే జీపీఎస్‌ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చుకోవాలి.

4 /6

Car Safety Tips: టైర్‌కు తాళం వేసుకోవాలి. ఒకవేళ దొంగతనం చేయాలనుకున్నా కారు ముందుకు కదలదు. స్టీరింగ్ వీల్ లాక్‌ని ఉపయోగించాలి. స్టీరింగ్ వీల్ లాక్‌ని దొంగలు తీయలేరు.

5 /6

Car Safety Tips: సురక్షిత ప్రాంతాలలోనే కారును పార్క్ చేయాలి. బాగా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్‌కు ఎంచుకోవాలి.

6 /6

Car Safety Tips: ఒకటికి రెండు సార్లు కారు లాక్ చెక్‌ చేసుకోవాలి. తప్పనిసరిగా కారును లాక్‌ చేయాలి. తెలిసిన ప్రదేశాలలో పార్క్ చేసినప్పటికీ ఎప్పుడూ  అద్దాలు, డోర్‌లను లాక్ చేయడం పరిశీలించాలి.