Lakshmi-Narayana Yoga Effect In Telugu: అక్టోబర్ నెల గ్రహ సంచారాల పరంగా ఎంతో శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో కూడా ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు తిరోగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కన్యా రాశిలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఒకే రాశిలో బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీ-నారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పొందుతారు. అయితే ఈ ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ లక్ష్మీ-నారాయణ యోగం ఏర్పడడం వల్ల తులా రాశివారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. వీరు విపరీతమైన డబ్బులు సంపాదించడమే కాకుండా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. దీంతో పాటు అద్భుతమైన జీవితాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
తుల రాశివారు కెరీర్ జీవితంలో కూడా విపరీతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరు అన్ని పనుల్లో విజయాలు సాధించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆనందం పొందుతారు. అలాగే వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశివారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
మకర రాశివారికి ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త జాబ్ ఆఫర్స్ కూడా పొందుతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఈ లక్ష్మీ-నారాయణ యోగం కారణంగా కుంభ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పనుల్లో ఊహించని విజయాలు కలగడమే కాకుండా వీరు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు.
అలాగే కుంభ రాశివారు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకి సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.