Wrinkles Removal Tips: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు సాధారణం. ముఖం, కళ్లు, మెడ భాగంలో ముడతలు స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఇదే ఏజీయింగ్ ప్రక్రియ. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలిలో మార్పు ద్వారా ముడతలు తగ్గించుకోవచ్చు
Wrinkles Removal Tips: కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఈ సమస్య నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొబ్బరి నూనెలో ఈ పదార్ధం కలిపి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, ముడతల్లేకుండా చేయవచ్చు.
కొబ్బరి నూనె, తేనె రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె తేనె కలిపి రాసుకోవాలి. ఒక చెంచా నూనెలో రెండు మూడు డ్రాప్స్ తేనె కలిపితే చాలు. రాత్రి రాసుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి నూనెతో విటమిన్ ఇ కొబ్బరి నూనెలో విటమిన్ ఇ డ్రాప్స్ కలపడం వల్ల మరింత ఎఫెక్టివ్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రాయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి
చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వల్ల పింపుల్స్, ముడతలు దూరమౌతాయి
ముడతలు దూరం చేయడం ఎలా ముడతల నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వస్తువులతోనే చర్మం యౌవనంగా, మృదువుగా, అందంగా చేయవచ్చు. కొబ్బరి నూనెతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.