Gold Rate Today: ఆల్ టైం దిశగా బంగారం ధర..నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?


Gold Rate Today: వ్యాప్తంగా...బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్ 16 వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం  బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. 

1 /6

Gold pricesToday: బంగారం  ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని ఆశించినవారిలో ఆందోళన మొదలైంది. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు ఇలా భారీగా పెరిగితే ఎలా కొనుగోలు చేయాలని ఆందోళన చెందుతున్నారు. కాగా నేడు అనగా సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం 24 క్యారట్ల బంగారం ధర రూ. 74,890 గా  పలుకుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ. 68,760గా  పలికింది.   

2 /6

ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికాలో ఆకస్మికంగా పెరిగిన రేట్లు వల్లనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికాలో బంగారం ధర ఒక ఔన్స్  2600 డాలర్లు దాటింది.  తాజాగా 2611 డాలర్ల  వద్ద నూతన రికార్డు ధర  నమోదు అయింది.  దీంతో బంగారం ధరలు ఆల్ టైం తాకినట్లు చెప్పవచ్చు.

3 /6

ముఖ్యంగా బుధవారం అమెరికాలో ఫెడరల్ రిజర్వు భేటీలో కీలకమైన వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందులో కీలక వడ్డీ రేట్లు పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు  తరలిస్తున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినట్లయితే అమెరికా జారీ చేసిన ట్రెజరీ బాండ్లకు రాబడి తగ్గిపోతుంది. 

4 /6

అయితే ఎవరైతే అమెరికా ట్రెజరీ బాండ్లలో  పెట్టుబడి పెట్టి రాబడి పొందుతున్నారో…వారు తమ పెట్టుబడులను ఉపసంహరించి స్థిరంగా ఆదాయం అందిస్తున్న సురక్షితమైన పెట్టుబడి సాధనం  బంగారం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.  బంగారం ధరలు అటు ఆషాడమాసం పూర్తయినప్పటి నుంచి భారీగా పెరగడం ప్రారంభించాయి.  ఈ నెల ప్రారంభంలో సుమారు 70 వేల రూపాయల వద్ద ఉన్న బంగారం ధర ఇప్పుడు 75 వేల రూపాయల సమీపానికి చేరింది.  

5 /6

మరికొన్ని సెషన్లలో బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయిని దాటే అవకాశం ఉంది.  మరోవైపు బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే కష్టతరంగా మారే అవకాశం ఉంది. గత ఐదు సంవత్సరాలలో బంగారం ధర దాదాపు రెండింతలు అయ్యింది. మార్కెట్లో మరి ఇతర ఆస్తి పెట్టుబడి సాధనం ఈ రేంజ్ లో పెరగలేదు అని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి మరో కారణం  మరి కొద్ది రోజుల్లో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాబోతోంది.   

6 /6

దీంతో దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి వాతావరణం ఏర్పడింది. ఈ సీజన్లోనే పెద్ద మొత్తంలో ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.  ముఖ్యంగా ధన త్రయోదశి లాంటి పండగల సందర్భంగా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను జనం కొనుగోలు చేస్తారు. ఇక దీపావళి సందర్భంగా కూడా బంగారు అభరణాలను కొనుగోలు చేసేందుకు జనం  మక్కువ చూపిస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇదే రేంజ్ లో కొనసాగినట్లయితే త్వరలోనే లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.