Brahmanandam Vs Ali: బ్రహ్మానందం Vs అలీ.. ఎవరి నెట్‌వర్త్ ఎంతో తెలుసా..!

Brahmanandam and Ali Networth: బ్రహ్మానందం, అలీ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ కామెడీన్లు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను ఎన్నో సినిమాల్లో నవ్వించి.. మెప్పించారు. తెలుగు సినిమా పేరు వినపడినంత కాలం ఈ ఇద్దరు స్టార్ల గురించి కచ్చితంగా చర్చ ఉంటుంది. అహా నా పెళ్లంట మూవీలో     అరగుండు పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం వందలాది సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. సీతాకోక చిలుక మూవీతో బాలనటుడిగా కెరీర్ ఆరంభించి.. వందల చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు అలీ.
 

1 /8

బ్రహ్మానందం వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో జన్మించిన ఆయన.. సినీ ఇండస్ట్రీకి రాకముందు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.   

2 /8

అహా నా పెళ్లంట మూవీ సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న ఏకైక నటుడిగా నిలిచారు.  

3 /8

చిరంజీవి, బాలకృష్ణ నుంచి నేటి తరం యంగ్ హీరోల సినిమాల వరకు దాదాపు అందరి చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  

4 /8

బ్రహ్మానందానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ రూ.500 కోట్లపైగా ఉన్నట్లు తెలుస్తోంది.  

5 /8

ఇక అలీ విషయానికి వస్తే.. 1981లో సీతాకోక చిలుక మూవీ ద్వారా బాల నటుడిగా కెరీర్ ఆరంభించారు.   

6 /8

ఆ తరువాత కామెడియన్‌గా.. హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఎన్నో పాత్రలతో మెప్పించారు.  

7 /8

అలీ ఇప్పటివరకు దాదాపు 1100పైగా సినిమాల్లో నటించారు. బుల్లితెరపై కూడా వివిధ షోలతో అలరించారు. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి.. టీడీపీ, వైఎస్సార్సీపీలో పనిచేశారు.  

8 /8

ప్రస్తుతం రాజకీయాలకు గుడ్‌పై చెప్పి.. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. అలీ నెట్‌వర్త్ రూ.100 కోట్లపైగానే ఉంటుందని అంచనా.