Pitru pakshalu 2024: 'అవిధవ నవమి'ఎప్పుడు.?.. సుమంగళిగా చనిపోయిన మహిళలకు ఈ రోజు మాత్రమే శ్రాద్ధం ఎందుకు చేయాలి.?

Pitru paksham Avidhava navami tithi: పితృపక్షాలను పదిహేనురాజుల పాటు భక్తితో జరుపుకుంటారు. సెప్టెంబర్ 26 వ తేదీన అవిధవా నవమి తిథి వస్తుంది.ఈ రోజు కేవలం సుమంగళిగా చనిపోయిన మహిళలకు మాత్రమే శ్రాధ్దకార్యక్రమం నిర్వహిస్తారు. 
 

1 /7

 పితృపక్షాలను చనిపోయిన మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ చేసే ఒక పుణ్యకార్యక్రమం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ పదిహేను రోజులలో చనిపోయిన వారు తిరిగి భూమ్మిమీదకు వచ్చి తమ వంశం వారు బుక్కెడు అన్నం పెడతారేమో.. అని ఎదురు చూస్తారంట.

2 /7

అందుకే చాలా మంది ఏదైన నదీతీరంలో లేదా బ్రాహ్మణుల దగ్గరకు వెళ్లి మరీ శ్రాద్దంను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా. చనిపోయిన మన పూర్వీకుల తిథి ప్రకారం పిండ ప్రదానం కార్యక్రమం చేయాలి. ఈ పదిహేను రోజుల పాటు ఏ రోజు చేసిన కూడా గొప్ప ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు.  

3 /7

అదే విధంగా కొంత మంది బ్రాహ్మణులకు బియ్యం, పప్పులు, వంట సామాగ్రిని దానంగాఇస్తుంటారు. దీని వల్ల కూడా పూర్వీకులు సంతుష్టి చెందుతారని చెబుతుంటారు.  మనం 365 రోజులు భోజనం చేస్తుంటాం. కానీ మన పూర్వీకులకు.. మాత్రం..పితృపక్షాల్లో ఒకరోజు అన్నం పెడితే.. ఏడాది అంతా అన్నం పెట్టిన పుణ్యం వస్తుందని పండితులు సూచిస్తుంటారు.

4 /7

అయితే..  పితృపక్షాలలో సుమంగళిగా చనిపోయిన మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజులో మాత్రం అవిధవ నవమిని నిర్వహిస్తారు. ఈరోజు మాత్రమే సుమంగళిగా చనిపొయిన మహిళలకు ప్రత్యేకంగా శ్రాధ్దకర్మాదికాలు చేయిస్తారు.అనాదీగా మనహిందు ధర్మాశాస్త్రంలో కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు  

5 /7

సుమంగళిగా చనిపోయిన మహిళలకు ఉత్తమ లోకాలు లభిస్తాయని చెబుతుంటారు. అందుకు సుమంగళిగా చనిపోయిన మహిళల కోసం..  పితృపక్షాంలలో అవిధావ నవని నిర్వహిస్తారు. ఈసారి సెప్టెంబరు 26 న అవిధావ నవమి వస్తుంది. ఈరోజున మాత్రం సుమంగళిగా చనిపోయిన వాళ్లకే శ్రాధ్దకార్యక్రమం నిర్వహిస్తారు.

6 /7

నవమి రోజు శ్రాధ్దం చేయడం వల్ల ఎంతో పుణ్యం కల్గుతుందని కూడా పండితులు చెబుతుంటారు.చాలా మంది కూడా ఏదో అనారోగ్యం వల్ల లేదా అనుకొని ఘటనలలో చనిపోతుంటారు.  పిండ ప్రదానం చేయడం వల్ల వచ్చే తరాలకు మంచి జరుగుతుందని కూడా భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణుడికి, ముత్తైదువను భోజనంకు పిలవాలి.   

7 /7

సుమంగళిగా చనిపోయిన మహిళలకు ఇష్టమైన చీరలు, గాజులు, పువ్వులు, బతికిన్నప్పుడు ఆమె ఇష్టంతో ఉపయోగించుకునే వస్తువులను కొనివ్వాలి. దీంతో చనిపోయిన వారు.. ఎంతో సంతోషించి తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని చెబుతుంటారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)