Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్‌ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్‌ చేయండి..

Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్‌ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సెప్టెంబర్‌ 21 శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? తెలుసుకుందాం.
 

1 /5

సాధారణంగా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రతి రెండో నాలుగో శనివారం బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇక ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు. ప్రతి మొదటి,మూడు, ఐదో శనివారాలు బ్యాంకులు పనిచేస్తాయి. అందులో ప్రత్యేకంగా ఏవైనా సెలవులు వస్తే తప్ప పనిదినాలుగ పరిగణిస్తారు.  

2 /5

ఆర్‌బీఐ నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెట్టిల్‌మెంట్‌ (RTGS) సెలవు దినాల జాబితాను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది, ముఖ్యంగా ఖాతాల క్లోజింగ్‌ ఉన్నప్పుడు కూడా సెలవు దినాలు ప్రకటిస్తాయి.  

3 /5

అయితే, 2024 సెప్టెంబర్‌ 21 శనివారం మూడో శనివారం కాబట్టి రేపు బ్యాంకులు పనిచేస్తాయి. కేవలం రెండో, నాలుగో శనివారాలు నెలలో అన్నీ ఆదివారాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు సెలవు దినంగా పరిగణిస్తారు.  

4 /5

బ్యాంకులు బంద్‌ ఉన్న సమయంలో కూడా డిజిటల్‌ చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌, వాట్సాప్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ పనులు చేసుకోవచ్చు.  

5 /5

ముఖ్యంగా సెప్టెంబర్‌ నెలలో కేవలం 15 రోజులపాటు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. గణేశ చతుర్థి, ఓనం, మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. కేంద్ర ప్రభుత్వ కేవలం మూడు నేషనల్‌ హాలిడేలను ప్రకటించింది. జనవరి 26, ఆగష్టు 15, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి.