Samantha: నాగచైతన్య ఇంట్లోనే కాదు.. సమంత ఇంట్లో కూడా మొదలైన పెళ్లి సంబరాలు..!

Samantha Second Marriage; సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది ఈ హీరోయిన్. ఇక అప్పటినుంచి.. ఇప్పటివరకు సమంతకి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరస సినిమాలు చేసుకుంటూ.. తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, హిందీ లాంటి భాషలలో కూడా సార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో సమంత షేర్ చేసిన.. కొన్ని ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి 

1 /6

నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తరువాత కొన్ని కారణాలవల్ల నాగచైతన్యతో.. విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి సమంతా. మల్లి పెళ్లి చేసుకుంటుందా.. లేదా..? అని అనుమానం ఎంతోమందిలో వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్యనే నాగచైతన్యకి.. శోభిత దూళిపాదాతో నిశ్చితార్థం జరగాగా…మరి సమంత కూడా త్వరలోనే ఎవరినన్నా నిశ్చితార్థం చేసుకుంటుందా అని.. సినీ ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

2 /6

ఇక తాజాగా సమంత ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగాయి. అయితే సమంత పెళ్లి కోసం అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే.  ఇది సమంత పెళ్లి కోసం కాదు..సమంత సోదరుడి పెళ్లి కోసం. ఇక ఈ పెళ్లి కోసం సమంత ఫ్యామిలీ మొత్తం.. అమెరికాకు వెళ్లి మరి డెస్టినేషన్ వెడ్డింగ్ రంగ రంగ వైభవంగా జరిపారు.

3 /6

ఇక ఈ పెళ్లిలో తెగ హడావిడి చేసింది సమంత.‌ తన తల్లితో అలానే తన సోదరిడితో సమంత దిగిన ఫోటోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఎర్ర డ్రస్సు వేసుకొని సమంత చాలా అందంగా కనిపించింది.

4 /6

ఇక ముఖ్యంగా సమంత తన తల్లితో దిగిన ఫోటోలు ఆమె అభిమానులను.. తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈమధ్య వరకు సమంతకి..సమంత ఫ్యామిలీకి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అనే మాటలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ ఫోటోలు చూస్తే అవి అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని..సమంత తన ఫ్యామిలీతో ఎంతో హ్యాపీగా ఉందని తెలుస్తోంది 

5 /6

ఇక సినిమాల పరంగా తీసుకుంటే విజయ దేవరకొండ ఖుషి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న సమంత.. త్వరలోనే తన సొంత నిర్మాణ సంస్థలో రామన్న మా ఇంటి బంగారం అనే చిత్రంలో కనిపించనుంది. వీటితో పాటు కొన్ని హిందీ సినిమాలు కూడా అంగీకరించింది సమంత.

6 /6

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం.. అభిమానుల మడిలో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయం గురించి తెలియాలి అంతే మాత్రం సమంత స్పందించాలి.