Success Story: నాడు రైతు కూలీ.. నేడు రూ. 100కోట్ల సోలార్ కంపెనీకి యజమాని.. స్వదేశీ గ్రూప్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ సక్సెస్ స్టోరీ ఇదే

Praveena K - Swadeshi Group : ఆరు రూపాయల రైతు కూలీ నేడు 100 కోట్లకు అధిపతి అయ్యాడు. అది కూడా కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే.  1800 రూపాయలు పెట్టుబడితో అతను అత్యంత వేగంగా 100 కోట్లు సంపాదించాడు అంటే ఆశ్చర్యపోక తప్పదు.  అలాంటి వ్యక్తి ఎవరు.. అతని విజయ రహస్యం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం..
 

1 /7

This is the path to enlightenment: కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంటే ఎవరైతే కృషి చేస్తారో వారికి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రస్తుత కాలంలో  మనం ధనవంతులం అవ్వాలంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. కృషి, పట్టుదల, తెలివితేటలు ఉంటే చాలు  వాటినే పెట్టుబడిగా పెట్టి  కుబేరులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం తెలుసుకునే  ప్రవీణ్ అలాంటి వ్యక్తి కావడం విశేషం.

2 /7

ఒకప్పుడు ఊరిలో రోజుకు ఆరు రూపాయల కూలీ పని చేసిన రైతు కొడుకు.. నేడు రూ.100 కోట్లకు పైగా విలువ చేసే 'స్వదేశీ కంపెనీ'కి యజమానిగా మారాడు. ప్రవీణ్ కేవలం రూ. 1,800తో ఈ కంపెనీని ప్రారంభించి, కానీ తన కష్టార్జితంతో దీనిని సోలార్ ఉత్పత్తులలో విజయవంతమైన, ప్రసిద్ధ సంస్థగా మార్చాడు.   

3 /7

ప్రవీణ్ కర్ణాటకలోని దావణగెరె నగరంలోని దేవర హొన్నాలి గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పొలాల్లో కూలి పనులు చేసుకునేవారు.ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రవీణ్ కూడా వారితో పాటు పొలాల్లో కూలి పని చేసేవాడు.  

4 /7

ప్రవీణ్ చదువు కోసం గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. తమ గ్రామంలో 10వ తరగతి పాసైన మొదటి వ్యక్తి ప్రవీణ్ కావడం విశేషం.  పేదరికంలో మగ్గుతున్న ప్రవీణ్ 10వ తరగతి పాసయ్యాక దావణగెరె పట్టణానికి చేరుకున్నాడు. 

5 /7

తన ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూనే ఫార్మసీ దుకాణంలో పార్ట్‌టైమ్‌గా పనిచేశాడు. ప్రతినెలా రూ.600 వేతనంగా పొందేవాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత 2006లో పార్లే కంపెనీలో ఉద్యోగం చేయడంతో ప్రవీణ్ ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. కోకాకోలా, విప్రో, ఓయో వంటి ప్రముఖ కంపెనీల్లో 15 ఏళ్లపాటు సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. ఓయోలో పని చేస్తున్నప్పుడు, దాని వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఆలోచన అతడిని ఆకట్టుకుంది ,  ప్రవీణ్ తన స్వంత స్టార్టప్‌ను ప్రారంభించాడు. 

6 /7

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రవీణ్ ఉద్యోగం కోల్పోయాడు. అప్పుడే సొంత  వ్యాపారం చేయాలకున్నాడు. ప్రవీణ్ తన భార్య చిన్మయి సహాయంతో తన కలను నెరవేర్చుకోవడం ప్రారంభించాడు. 2020 ప్రారంభంలో, ప్రవీణ్ మైసూర్‌లో 'స్వదేశీ గ్రూప్' పేరుతో తన సోలార్ ఉత్పత్తులకు సంబంధించిన స్టార్టప్‌ను ప్రారంభించాడు. తను ఆదా చేసిన రూ.1,800తో కంపెనీని రిజిస్టర్ చేసుకున్నాడు.   

7 /7

ఒక ఇన్వెస్టర్ ప్రవీణ్ ఆలోచనకు ఆయన చాలా ఇంప్రెస్ అయి.వ్యాపారం ప్రారంభించడానికి, అతను ప్రవీణ్‌కి పది లక్షల రూపాయలు ఇచ్చాడు, ఈ డబ్బు సహాయంతో, ప్రవీణ్ ఒక షోరూమ్ తెరిచాడు. సోలార్ వాటర్ హీటర్, ఇన్వర్టర్, బ్యాటరీ, వాటర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ వాటర్ లెవల్ కంట్రోలర్, వంటి సౌరశక్తితో నడిచే వివిధ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించాడు.  క్రమంగా ఈ బిజినెస్ విస్తరించి ప్రస్తుతం 100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థగా స్వదేశీ కంపెనీ  అత్యంత వేగంగా విస్తరించడం  నేటి యువతకు ఒక ఆదర్శం అనే చెప్పాలి.  ప్రస్తుతం  ప్రవీణ్ స్థాపించిన స్వదేశీ గ్రూపు సంస్థకు దేశవ్యాప్తంగా డీలర్లు ఉన్నారు.