Samsung Galaxy A16 5G Launch: వారేవా ఏమి డిజైన్‌.. చూస్తేనే కొనాలనిపిస్తుంది.. సాంసంగ్‌ నుంచి చీపెస్ట్‌ అద్భుతమైన మొబైల్‌!

Samsung Galaxy A16 5G Launch: అతి త్వరలోనే మార్కెట్‌లోకి Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. 


Samsung Galaxy A16 5G Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌ మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ Samsung Galaxy A16 5G పేరుతో విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు  NBTC సైట్‌లో కనిపించాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను భారత్‌లో ఇప్పటికే సాంసంగ్ ప్రత్యేకమైన పేజీలో ప్రసారం కూడా చేస్తోంది. 

1 /5

ఈ Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ SM-A166P/DS మోడల్ నంబర్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులో ఉండే చివరి DS అక్షరాలను కంపెనీ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌గా పేర్కొంది. ఈ మొబైల్‌ ఇప్పటికే వివిధ రకాల డేటా బేస్‌లో కూడా కనిపించింది.  

2 /5

ఈ Samsung Galaxy A16 5G మొబైల్‌ 3C లిస్టింగ్ ప్రకారం, శక్తివంతమైన 4860mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా Exynos 1330 5G చిప్‌సెట్‌తో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

3 /5

అలాగే ఈ మొబైల్‌ను ప్రీమియం MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. ఇక దీని బ్యాక్ సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఈ Samsung Galaxy A16 5G మొబైల్‌ మూడు కెమెరా సెన్సార్స్‌తో రానుంది.

4 /5

ఈ మొబైల్‌ సాంసంగ్‌ కంపెనీ మొత్తం మూడు (లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్‌తో పాటు గోల్డెన్) కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. దీంతో పాటు LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. 

5 /5

ఇక Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది యూ ఆకారం డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 6.7 అంగుళాల U డిస్‌ప్లే సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌పై 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తోంది.