Anushka: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ అనుష్క.. వరుడు ఎవరంటే..?

Anushka Marriage : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం సూపర్.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు తొలిసారి అనుష్క శెట్టి పరిచయమయ్యింది. 

1 /6

అరుంధతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది అనుష్క.   ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి పెరిగిపోయింది.  ఈ సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ సరైన అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. 

2 /6

ముఖ్యంగా బిల్లా వంటి చిత్రాలలో బికినీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సాంప్రదాయంగా కనిపించి మెప్పించిన చిత్రాలు  కూడా ఉన్నాయి. బాహుబలి తర్వాత నిశ్శబ్దం , భాగమతి,  సైజ్ జీరో లాంటి సినిమాలలో నటించింది.   

3 /6

సైజ్ జీరో సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అనుష్క గత ఏడాది మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది .ఈ సినిమా తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 19 ఏళ్ల తర్వాత మలయాళం  ఇండస్ట్రీలోకి తొలిసారి అడుగు పెట్టబోతోంది. 

4 /6

ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ ను  వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు రాగా..తాము  ఇద్దరం స్నేహితులం అంటూ రూమర్స్ కి చెక్ పెట్టారు.

5 /6

ఆ తర్వాత ఒక నిర్మాతను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా.  అవి నిజం కాలేదు. ఇప్పుడు వ్యాపారవేత్తను వివాహం చేసుకోవడానికి సిద్ధమైందని,  ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు కానీ ఇంకా అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం.

6 /6

ఒకవేళ అనుష్క వీరి పెళ్లికి ఒప్పుకుంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు వేయబోతోందని చెప్పవచ్చు.