Bathukamma 2024: మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

Bathukamma 2024: పెత్తర అమావాస్యతో ప్రారంభయ్యే బతుకమ్మ పండుగ ఈసారి అక్టోబర్‌ 2వ తేదీ ప్రాంరంభం కానుంది. ఈ సందర్భంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకొంటారు. అయితే, ఈ బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
 

1 /5

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగను అంగరంగా వైభవంగా తెలంగాణ మహిళలు జరుపుకొంటారు. తీరొక్క పూలతో ఈ బతుకమ్మ వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. రేపు కూడా ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది.  

2 /5

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానెబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.  

3 /5

ఈ ఏడాది అక్టోబర్ 2న పెత్తర అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగియనుంది. భాద్రపద అమావాస్య రోజు ఈ వేడుక మొదలవుతుంది. ఈ బతుకమ్మలో వాడే పూవ్వులో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  

4 /5

బీర గుమ్మడి, టేకు ఆకులను కింద భాగాన ఉంచి బతుకమ్మను పేరుస్తారు. ఇందులో గునును, తంగేడు, చామంతి, బంతిని గుడిగోపురం ఆకారంలో తయారు చేసి పసుపుతో గౌరమ్మను తయారు చేసి అందరూ కలిసి ఆడుకుని సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు.  

5 /5

అయితే మొదటిరోజు జరుపుకొనే బతుకమ్మను పూలను పేర్చినప్పుడు నోటితో కాడలను తెంచుతారు. అంతేకాదు వీటిని అమావాస్యకు ఒకరోజూ ముందుగానే తెచ్చి పెడతారు కాబట్టి వీటిని ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వర్షాలు కూడా బాగా పడతాయి. దీంతో చెరువులు, బావులు అంత జలకళ సంతరించుకుంటుంది.