PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?

PM Kisan Yojana 18 th Intstalment: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన 18వ విడత అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నారు. ఏడాదికి ఆరువేలు జమా చేస్తుంది కేంద్రం అయితే, రూ.4,000 అదనంగా జమా చేయనున్నారు.
 

1 /5

పీఎం కిసాన్‌ యోజనలో కీలక మార్పు జరిగింది. బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లను కేటాయించిన కేంద్రం ప్రతి ఏడాది రూ.6 వేలు రైతుల ఖాతాలో మూడు విడతలుగా ఖాతాల్లో జమా చేస్తుంది.  

2 /5

అయితే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జమ్మూ కశ్మీర్‌లో ఉండే రైతులకు రూ.4 వేలు అదనంగా జమా చేయనుందట. అంటే వారికి రూ.10 వేలు ఏడాదికి అందుతాయి.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు.   

3 /5

కాగా ఇతర రాష్ట్రాల రైతులకు రూ.6 వేలు ఏడాదికి జమా చేస్తారు. 18 విడుత డబ్బులను అక్టోబర్‌ 5వ తేదీ పీఎం నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. వీరికి రూ.2000 మూడు విడుతలుగా జమా చేయనున్నారు.  

4 /5

జమ్మూ కశ్మీర్‌లో ఉండే రైతులకు రూ.10 వేలు అంటే రూ.3 వేలు రెండుస్లార్లు రూ.4 వేలు ఒకసారి జమా చేయనున్నట్లు సమాచారం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రూ.2000 జమా అవుతున్న సంగతి తెలిసిందే.  

5 /5

జూన్‌ నెలలో 17వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.మీరు కూడా పీఎం కిసాన్‌కు అర్హత సాధించాలంటే పీఎం కిసాన్‌ యోజన అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.