Sun-ketu Conjunction Effect: కేతువు సంచారంతో 2025 నాటికి ఈ మూడు రాశులకు రాజయోగం..!

Sun-ketu Conjunction On Zodiac Signs: రాశిచక్రం రాశులలో కన్య రాశి ఒకటి. ప్రస్తుతం ఈ రాశిలోకి కేతు గ్రహం ప్రవేశించింది. దీని వల్ల కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కేతు ప్రభావం కారణంగా 2025 నాటికి మూడు రాశులవారికి అద్భుమతైన యోగం కలుగనుంది. కేతు సంచారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఏ రాశి వారికి దివ్యమైన యోగం ఉంది? అనేది తెలుసుకుందాం.
 

Sun-ketu Conjunction On Zodiac Signs: కేతువు అనేది జ్యోతిష శాస్త్రంలో చాలా ముఖ్యమైన గ్రహం. ఇది ఒక ఛాయా గ్రహం. కేతువును మోక్షానికి సంబంధించిన గ్రహంగా కూడా భావిస్తారు. కేతు గ్రహాం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి పద్దెనిమిది నెలలు పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేతువు కన్యారాశిలో ప్రవేశించింది. మళ్ళీ 2025 సంవత్సరంలో తన రాశి స్థానాన్ని మార్చనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారికి అదృష్టం కలగనుంది. వీటిలో మీ రాశి ఉందో లేదో తెలసుకోండి. 
 

1 /6

కేతువు అనేది జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన నీడ గ్రహం. ఈ గ్రహం రాహువుతో కలిసి జాతక చక్రంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది.

2 /6

ఈ కేతు గ్రహం మోక్షం, ఆధ్యాత్మికత, మార్పులకు సంబంధించినదిగా భావిస్తారు. కేతువు వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. 

3 /6

కేతు గ్రహం వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు అనూహ్యంగా ఉండవచ్చు, కానీ చివరికి వ్యక్తిని మెరుగైన మార్గంలో నడిపిస్తాడు.

4 /6

మేషం రాశి:  మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసికంగా ప్రశాంతత పొందుతారు. 

5 /6

కర్కాటక రాశి: శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో బోలెడు లాభాలు కలుగుతాయి. ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.  

6 /6

వృశ్చిక రాశి: వ్యాపారం, ఉద్యోగం, విద్య రంగాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబసభ్యులతో  కలిసి శుభకార్యలయాల్లో పాల్గొంటారు.