Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి. అయితే, నవరాత్రల్లో రెండో రోజు 4వ తేదీ శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
నవ రాత్రుల్లో మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. నేడు గురువారం అమ్మవారి అలంకరణ. అయితే, రెండో రోజు గాయత్రీ దేవి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో పూజిస్తారు.
నవరాత్రిలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు కూడా దుర్గాపూజను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అయితే, 9 రోజులపాటు పూజించే అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.
రెండో రోజు ఆశ్వీయుజ విదియ రోజున గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మవారి అలంకరణలను పరిగణలోకి తీసుకుంటారు.
4వ తేదీ శుక్రవారం గాయత్రీ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని తామరపూలు, కలువపూలతో ప్రత్యేకంగా పూజిస్తారు. కనకాంబరం రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు. ఈరోజు గాయత్రీ మంత్రి పటించాలి. ప్రసాదంగా అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను పెడతారు.
ఈరోజు గాయత్రీ మంత్రాన్ని పటిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పూజ చేయడం వల్ల శత్రుపీడ నశిస్తుంది. అంతేకాదు ఈరోజు అమ్మవారి పేరు మీదుగా ఎర్రటి గాజులను దానంగా ఇవ్వాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)