Itching in Palms: చేతులు తరచూ దురద పెడుతున్నాయా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు

శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని మార్పులు వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. సాధారణంగా చర్మం దురద పెడుతుంటే తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ అదే దురద తరచూ వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. 5 ప్రమాదకర రోగాలకు సంకేతాలు కావచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Itching in Palms: శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని మార్పులు వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. సాధారణంగా చర్మం దురద పెడుతుంటే తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ అదే దురద తరచూ వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. 5 ప్రమాదకర రోగాలకు సంకేతాలు కావచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

1 /5

డయాబెటిస్ డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు కూడా చేతులు దురదగా ఉంటాయి. రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చేతులపైనే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా ఉంటుంది

2 /5

ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే చేతులపై తరచూ దురద వస్తుంటుంది. వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. 

3 /5

ఎలర్జీ సాధారణంగా చర్మం చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల అలర్జీ బారిన పడుతుంటుంది. కొన్ని వస్తువులతో ఎలర్జీ ఉన్నప్పుడు వాటిని ముట్టుకుంటే చాలు దురద వస్తుంటుంది. ఎలర్జీ ఉండే వస్తువులకు దూరంగా ఉండాలి

4 /5

సోరియాసిస్ చర్మంలోని కణజాలాలు అపరిమితంగా వృద్ధి చెందుతున్నప్పుడు చర్మంపై అవి పేరుకుపోతాయి. దీనినే సోరియాసిస్ అంటారు. ఇలా ఉంటే చేతులు, శరీరంలోని ఇతర అవయవాలపై దురద విపరీతంగా ఉంటుంది.

5 /5

ఎగ్జిమా ఇక ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా సమస్య ఉన్నప్పుడు కూడా చేతుల్లో దురద ఎక్కువగా ఉంటుంది. చర్మంపై చిన్న చిన్న మొటిమల్లాంటివి కూడా కన్పిస్తాయి. ఎర్రని ర్యాషెస్ రావచ్చు.