Navaratri 2024: నవ రాత్రుల్లో 7వ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా? ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు..

Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం  కూడా కలుగుతుంది. అక్టోబర్‌ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు. ఈరోజు మూల నకత్రంలో అమ్మవారిని పూజిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి.
 

1 /5

నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాల్లో పూజిస్తారు. అయితే, బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రామాణికంగా తీసుకుంటారు.  

2 /5

నవరాత్రిలు ఈ ఏడాది అక్టోబర్‌ 3న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 12     విజయదశమితో పూర్తవుతుంది. నవరాత్రుల్లో అష్టమి కూడా విశేష ప్రయోజనాలు ఇస్తుంది. అయితే, ఆరోజు దుర్గాష్టమిగా కూడా జరుపుకొంటారు.  

3 /5

నవరాత్రి 7వ రోజు అత్యంత విశేషమైన రోజు. నేడు మూలనక్షత్రం కాబట్టి ఈరోజు దుర్గామాతను సరస్వతి రూపంలో పూజిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు చీర సమర్పిస్తారు.   

4 /5

ఈరోజు సరస్వతి కటాక్షం కలగాలని అక్షరాభ్యాసం కూడా చెబుతారు. పసుపు, కుంకుమ, అక్షితలతో అమ్మవారిని పూజించాలి. ఈ పూజలో పిల్లలు కూడా ఉండేలా చూడాలి.దీంతో వారికి మంచి జ్ఞానం కూడా కలుగుతుంది.  

5 /5

అంతేకాదు ఈ రోజు అమ్మవారికి ప్రసాదం దద్దోజనం పెడతారు. పిల్లలకు చదువు, జ్ఞానం బాగా రావాలని కోరుకుంటూ పూజిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)