Pension: పెన్షనర్‎లకు అలర్ట్...నవంబర్ ముగిసేలోగా ఈ పనిచేయకపోతే పెన్షన్ కట్

Digital Life Certificate: పెన్షన్లకు బిగ్ అలర్ట్. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్ లైన్లోనే డిజిటల్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇది పెన్షనర్ బతికే ఉన్నారని రుజువుకు చేసేందుకు ఇవ్వాల్సి ఉంటుంది. 

1 /6

Digital Life Certificate: చాలా మంది పెన్షన్ తీసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సమయానికి పెన్షన్ అందుకోవాలంటే తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ అందజేయాలని పేర్కొంది. ప్రతి నవంబర్ లో జీవన ప్రమాణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ ను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పోస్టాఫీస్ లేదా పెన్షన్ డిస్ బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ ను అందించాలి ఉంటుంది.   

2 /6

పెన్షన్ తీసుకునేవారు పలు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్ ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేయవచ్చు. ఇది పెన్షన్ ఇప్పటికీ జీవించి ఉన్నారని రుజువు చేసేందుకు తీసుకుంటారు. ఇంతకీ సర్టిఫికేట్ ఎప్పటిలోగా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా సబ్‌మిట్ చేయాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

3 /6

గడువు తేదీ 80ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ వయస్సుకన్న సీనియర్ సిటిజన్లు లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ప్రత్యేక ఉపశమనం ఉంది. వారు ఇప్పుడు నవంబర్ వరకు వేచి ఉండకుండా అక్టోబర్ 1 నుంచి తమ లైప్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో వ్రుద్ధులకు మరింత సమయం, సౌలభ్యం లభిస్తుంది. 

4 /6

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకువచ్చారు. ఆధార్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

5 /6

ఈ సర్టిఫికేట్ ను రూపొందించడానికి సమర్పించేందుకు పెన్షన్లరు తమ ఆధార్ కార్డు, బయోమెట్రిక్ డీటెల్స్ ఉపయోగించాల్సి వస్తుంది. డీఎల్సీ ద్వారా పెన్షనర్ గుర్తింపును డిజిటల్ గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా పెన్షన్ వస్తుంది.   

6 /6

సర్టిఫికేట్ సమర్పించకుంటే ఏం జరుగుతుంది. నవంబర్ లోగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించకపోతే, సర్టిఫికేట్ సమర్పించే వరకు వారి పెన్షన్ చెల్లింపులు ఆగుతాయి. ఈ చర్యల తర్వాత నెల అంటే డిసెంబర్ నుండే అమలు అవుతాయి. కాబట్టి పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు లైఫ్ సర్టిఫికేట్స్ సకాలంలో సమర్పించడం చాలా మంచింది.