Tomatoes: టమాటా రెట్లు పెరిగాయని నోటెన్షన్.. బెస్ట్ ప్రత్యామ్నాయాలివే.. అంతే రుచి.. యమ్మీ యమ్మీ‌గా..

Tomatoes price hike: కొన్నిరోజులుగా మార్కెట్ లో టమాటాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.చాలా చోట్ల టమాటాల ధరలు సెంచరీలను సైతం దాటేశాయి. టమాటాలు తక్కువ ధరకు అమ్మలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.

1 /6

మార్కెట్ లో టమాటాల ధరలు ప్రస్తుతం సెంచరీ దాటేశాయి. చాలా చోట్ల టమాటాలు కొనాలంటేనే ప్రజలు భయంతో ఆమడ దూరం పోతున్నారు. అయితే.. వంటిట్లో..టమాటలకు బదులుగా కొన్నిపదార్థాలను టమాటాలకు బదులుగా ఉపయోగించవచ్చు.  

2 /6

చింత పండును టమాటాకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్తుంటారు. ఇది పుల్లగా ఉండటంతో పాటు.. సాంబార్, రసం, కూరగాయాల్లో వేస్తే టెస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

3 /6

ఉసిరికాయలో కూడా మంచి గుణాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయల్ని ఎండలో ఆరబెట్టి, వీటి నుంచి గింజల్ని తీసి వేసి గ్రౌండర్ లో పౌడర్ లా చేసుకొవాలి. ఇది కూరలు, వంటకాలలో ఉపయోగించవచ్చు  

4 /6

నిమ్మ కాయలు.. వీటిలో విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. రోజు నిమ్మకాయ రసంను వంటలలో ఉపయోగిస్తే ఆహార పదార్థాలు టెస్ట్ బాగా ఉంటుంది.  అందుకు రోజు నిమ్మకాయ రసాన్ని వంటలలో ఉపయోగిస్తే టెస్ట్ బాగుంటుంది. నిమ్మరసంలో ఉప్పు వేసి ఉంచితే.. చాలా కాలం నిల్వ ఉంటుంది.  

5 /6

క్యాప్సికమ్ వీటిని కూడా టమాటాలకు బదులుగా ఉపయోగిస్తే.. పుల్లగా, కారంగా కూడా టెస్ట్ బాగుంటుంది. అందుకే వంటలలో చాలా మంది వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

6 /6

మామిడి అనేది ఎవర్ గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని చాలా మందిగుజ్జులా చేసుకుని వంటలలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. మామిడి ముక్కల్ని వంటలలో, సాంబార్ చేయడంలో ఉపయోగిస్తారు. మామిడికాయ రసం,పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)