Ananya Pandey controversy : లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనన్య పాండే. మొదటి సినిమానే దిజాస్టర్ కావడంతో ఆ తరువాత ఈ హీరోయిన్ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే హిందీలో మాత్రం ఈ హీరోయిన్ కి వరస చాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ హీరోయిన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే స్త్రీ 2 చిత్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ .600 కోట్లకు పైగా కలెక్షను రాబట్టి రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అల్లరిస్తున్న ఈమె తాజాగా ఒక స్టార్ హీరో కొడుకు నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అనన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట.. తెగదుమారం రేపుతున్నాయి.
అసలు విషయంలోకెళితే.. అనన్య పాండే, షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన చిన్నతనంలో ఆర్యన్ ఖాన్ తో ఉన్న జ్ఞాపకాలను కూడా పంచుకుంది. అనన్య మాట్లాడుతూ ..నేను చిన్నప్పటి నుంచి రోజంతా ఏం చేస్తాను.. ఏం తింటాను అన్నీ కూడా వీడియోలో రికార్డ్ చేస్తాను. కానీ వాటిని ఎప్పుడు కూడా పబ్లిష్ చేయలేదు. ఇప్పటికీ ఆ వీడియోలు నా దగ్గరే ఉన్నాయి అంటూ తెలిపింది.
అయితే ఆ వీడియోలను లీక్ చేస్తా అంటూ ఆర్యన్ తనను బెదిరించేవాడని , తాను చెప్పిన పని చేయకపోతే ఆ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసేవాడని చిన్నప్పటి విషయాలను పంచుకుంది అనన్య.
మరోవైపు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్. ప్రస్తుతం దుస్తుల వ్యాపారంలో బిజీగా ఉన్న ఈయన బిజినెస్ రంగంలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.. త్వరలోనే ఆడియన్స్ ముందుకి కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో డ్రగ్స్ కేస్ లో ఇరుక్కుని జైలుకి కూడా వెళ్లొచ్చిన ఆర్యన్.. ఇప్పుడు బుద్ధిగా మారి కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.