Costly Fishes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపలు, ధర తెలిస్తే షాక్ కొడుతుంది

మీరు మాంసాహారులైతే ఈ ఆర్టికల్ మీ కోసమే. మాంసాహారం తినేవారిలో చాలామంది చేపల్ని ఇష్టపడుతుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన చేపలేంటో, ఎలా ఉంటాయో, ఎంత ఖరీదు చేస్తాయో తెలుసా. అలాంటి 5 చేపల గురించి తెలుసుకుందాం.

Costly Fishes: మీరు మాంసాహారులైతే ఈ ఆర్టికల్ మీ కోసమే. మాంసాహారం తినేవారిలో చాలామంది చేపల్ని ఇష్టపడుతుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన చేపలేంటో, ఎలా ఉంటాయో, ఎంత ఖరీదు చేస్తాయో తెలుసా. అలాంటి 5 చేపల గురించి తెలుసుకుందాం.
 

1 /6

ప్రపంచవ్యాప్తంగా ఫిష్ మార్కెట్ చాలా పెద్దది. చాలా దేశాలకు ఇదొక పెద్ద వ్యాపారం కూడా. చేపల వేలం కూడా జరుగుతుంది. అత్యంత ఖరీదైన చేపలేవో చూద్దాం.

2 /6

American Glass Eel ఈ చేప నార్త్ అమెరికాకు చెందిన నార్త్ ఈస్ట్ తీరంలో లభిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన చేప. ఇది చూసేందుకు గాజులా కన్పిస్తుంది. ఆకారంలో చాలా చిన్నది. 3 ఇంచెస్ ఉంటుంది. 4 అడుగుల వరకూ పెరుగుతుంది. పౌండ్ చేపలు 3 వేల డాలర్లు అంటే 2,52,181 రూపాయలు

3 /6

Bluefin Tuna అత్యంత ఖరీదైన చేపల గురించి తెలుసుకుంటే అందులో మొదటి పేరు బ్లూఫిన్ ట్యూనా. ఇవి ఆకారంలో చాలా పెద్దవి. టార్పిడోలా ఉంటుంది.. క్రాస్ సెక్షన్‌లో సర్క్యులర్ ఉంటుంది. ఈ చేప ఖరీదు పౌండ్‌కు 5000 డాలర్లు అంటే 4 లక్షల 20 వేలు. ఇది అత్యంత రుచికరమైంంది ఆరోగ్యకరమైంది.

4 /6

Sword Fish ఈ చేప పేరుకు తగ్గట్టే స్వోర్డ్‌లా ఉంటుంది. ఈ చేప అట్లాంటిక్ మహా సముద్రంలో ఉంటుంది. ఈ చేప 91 కిలోల బరువు ఉంటుంది. ప్రతి పౌండ్ 5100 రూపాయలు అంటే 60 డాలర్లు ఉంటుంది.

5 /6

Wild Alaskan King Salmon ఈ చేప అలాస్కాలోని అందమైన పరిశుభ్రమైన నీటిలో లభిస్తుంది. ఈ చేప చూసేందుకు రెడ్ కింగ్ సాల్మన్ చేపలా కన్పిస్తుంది. చాలా రుచికరమైన చేప ఇది. ఈ చేప పౌండ్‌కు 70 డాలర్లు ఉంటుంది. అంటే 5,884 రూపాయలు. 

6 /6

Pufferfish ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైందే కాకుండా అత్యంత భయంకరమైంది కూడా. ఈ చేపకు ఉండే ముళ్లు అత్యంత విషపూరితమైనవి. రెస్టారెంట్లలో ఈ చేపను సర్వ్ చేస్తారు. ఈ చేప ఖరీదు పౌండ్‌కు 200 డాలర్లు. అంటే 17 వేల రూపాయలు.