EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
EDLI Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక రకాల దీపావళి కానుకలను ప్రవేశపెట్టింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను ఉద్దేశించి డిఏ పెంపుదలతో వారికి వరాల జల్లు కురిపించింది. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులకు కూడా మరో వరాన్ని ప్రకటించింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది.
దీని వల్ల ఆరు కోట్ల కంటే ఎక్కువ EPFO సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీని లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గురువారం వెల్లడించారు. PTI రిపోర్టు చేసిన వార్తల ప్రకారం, రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO సభ్యులందరూ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ప్రయోజనం పొందుతారు.
EDLI పథకం లక్ష్యం: అందుతున్న సమాచారం ప్రకారం, 1976 సంవత్సరంలో ప్రారంభించిన EDLI పథకం లక్ష్యం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు బీమా ప్రయోజనాలను అందించడమే. తద్వారా సభ్యుడు మరణించిన సందర్భంలో ఆర్థిక సహాయం లభిస్తుంది. ప్రతి సభ్యుని కుటుంబానికి భరోసా లభిస్తుంది. ఏప్రిల్ 2021 వరకు, EDLI పథకంలో నిర్వచించిన ప్రమాణాల ప్రకారం మరణించిన ఉద్యోగి చట్టపరమైన వారసుడికి గరిష్ట ప్రయోజనం రూ. ఆరు లక్షలకు పరిమితం చేశారు.
కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 28, 2021న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా, ఈ పథకం కింద కనీస బెనిఫిట్ రూ. 2.5 లక్షలు, గరిష్ట బెనిఫిట్ రూ. 7 లక్షలకు తదుపరి మూడేళ్లకు పెంచింది. అదనంగా, ఆ కాలంలో ఉద్యోగాలు మారే ఉద్యోగులను కవర్ చేయడానికి ఒక సంస్థలో 12 నెలల నిరంతర సర్వీస్ అవసరం కూడా సడలించారు. ఈ ప్రయోజనాలు ఏప్రిల్ 27, 2024తో ముగిసే మూడేళ్ల కాలానికి అమలులో ఉంటాయి.
ఇదిలా ఉంటే కేంద్రంలో మొదటి ప్రభుత్వం తాజాగా ఈపీఎఫ్ చందాదారుల్లో పెన్షన్ స్కీమ్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా త్వరలోనే హైయర్ పెన్షన్లు అందించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హయ్యర్ పెన్షన్ పైన సానుకూలంగా స్పందించారు.
ఈపిఎస్ 95 ప్రకారం త్వరలోనే సభ్యులందరికీ హయ్యర్ పెన్షన్ అందించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పైన పరిష్కారం లభించే అవకాశం ఉందని పెన్షనర్లు సైతం ఆశ వ్యక్తం చేస్తున్నారు.