Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల రాజ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో ఉన్నతికి కారణమౌతాయి. ఆసమయంలో ఏది చేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్తుంటారు. వీటిలో గజకేసరి యోగం అత్యంత ప్రధానమైందని కూడా చెప్పవచ్చు.
దీపావళిని అనాదీగా మూడు రోజుల పాటు జరుపుకుంటుంటాం. అది ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి లక్ష్మీదేవి పూజలు అని చెబుతుంటారు. ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు జరుపుకుంటారు.
అయితే.. దీపావళి నేపథ్యంలో.. దాదాపు 500 ఏళ్ల తర్వాత దీపావళి నాడు ఐదు రాజయోగాలు కలిసి రాబోతున్నాయి. దీపావళి నాడు శుక్ర, శని, చంద్ర, గురు, బుధ స్థానములచే ఏర్పడిన గజకేసరి యోగము, సౌభాగ్యయోగము, ఆయుష్మాన్ యోగము, బుధాదిత్య రాజయోగము, శశ మహాపురుష రాజయోగములు ఏర్పడుతున్నాయి.
దీని వల్ల కొన్నిరాశుల వారికి అనుకొని విధంగా సంపదలతో పాటు, జాబ్ లో ప్రమోషన్ లు, నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం, విదేశీ యానానికి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మేషం: ఈ సంవత్సరం దీపావళి మేషరాశి వారికి చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. వీరికి ఏన్నో ఏళ్లుగా రాకుండా ఉన్న సందన వీరి సొంతమౌతుంది. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లు లభిస్తాయి.
ధనుస్సు: దీపావళి నాడు ఏర్పడిన ఐదు రాజయోగాల అద్భుతమైన కలయిక ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. దీపావళి నుంచే వీరి సుడితిరిగిపోతుందని చెప్పుకొవచ్చు. నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం : ఈ దీపావళి మిథునరాశి వారికి చాలా ప్రత్యేకం కానుంది. ఉద్యోగం చేస్తున్న వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.గవర్నమెంట్ జాబ్ ల కోసం చూసే వారికి కోరిక నెరవేరుతుంది. పచ్చి పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే మీ మనస్సులోని కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)