Tirupati Railway Station: తిరుమల వెళ్లేవారికి అప్డేట్.. పూర్తిగా మారబోతున్న తిరుపతి రైల్వే స్టేషన్.. ఎక్కడ, ఎలా ఉంటుందంటే..


Tirupati Railway Station Change: రూ.300 కోట్లతో అతి త్వరలోనే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రైల్వే స్టేషన్ అతి సుందరంగా రూపుదిద్దుకోబోతోంది. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి.


Tirupati Railway Station Change: కేంద్రం తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీం లో భాగంగా త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త రూపు దిద్దుకోబోతోంది. కేంద్రం ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన బడ్జెట్ లో భాగంగా రూ.300 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చబోతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ను అత్యద్భుతంగా ఆధునికరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 53 రైల్వే స్టేషన్లలో మరమ్మత్తులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 

1 /6

తిరుపతి రైల్వే స్టేషన్ కు సంబంధించిన రూపురేఖలు అతి త్వరలోనే మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ కి రూ.300 కోట్లతో త్వరలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేయబోతోంది. రైల్వే స్టేషన్ లో భాగంగా త్వరలోనే ఫ్లాట్ ఫార్ముల పైభాగాలను కూడా వినియోగించుకునేందుకు కొత్తగా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టబోతోంది.  

2 /6

అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ కు అద్భుతమైన డిజైన్తో కూడిన టెర్మినల్ భవనాలను నిర్మించబోతోంది. అలాగే ప్లాట్ఫామ్స్ పై ప్రత్యేకమైన స్పేస్ ను క్రియేట్ చేసి కమర్షియల్ గా అందించబోతున్నట్లు తెలుస్తోంది.  

3 /6

రూ.300కోట్లతో రైల్వే స్టేషన్ కు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో తిరుపతికి వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్ ఫార్మ్స్ ను కూడా ఆధునికరించబోతున్నట్లు తెలుస్తోంది.    

4 /6

అంతేకాకుండా తిరుపతికి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలను కూడా క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే వెయిటింగ్ లాంజ్‌లు, కమర్షియల్ ఏరియాను అభివృద్ధి చెయ్యబోతోంది. అత్యంత రద్దీగా ఉండే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఆహ్లాదకరంగా మారబోతోంది.  

5 /6

అయితే తిరుపతిలోని రైల్వే స్టేషన్ కు సంబంధించిన టెర్మినల్ కొత్త భవనానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అతి త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు అక్కడి రైల్వే అధికారులు తెలిపారు.  

6 /6

అంతేకాకుండా కేంద్ర రైల్వే శాఖ త్వరలో అభివృద్ధి చేయబోయే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాములపై భాగాలను కూడా కమర్షియల్ గా సద్వినియోగం చేసుకునేందుకు కొత్త డిజైన్లతో నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపింది. ప్లాట్ఫార్మ్స్ వద్ద రైలు రాకపోకలు దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన స్పేస్ను క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.