Cyber Crime: శిల్పా శెట్టి భర్త పేరుతో కొత్త సైబర్ నేరం.. ఇలాంటి క్రైమ్ స్టోరీ సినిమాల్లో కూడా ఉండదు..!

Shilpa Shetty Husband Cyber Crime: గత కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను టార్గెట్ గా చేసుకొని.. అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఎమ్మెల్యేకి డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్లో బెదిరిస్తూ,  మరో ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ గా వీడియో కాల్ చేయడం ఇలా ఈ సంఘటనలన్నింటిపై కేసులు నమోదైన విషయం అందరికీ తెలుసు.
 

1 /5

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కరీంనగర్ ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు సరికొత్తగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త.. అక్రమ ఆస్తుల వివాదంలో అతనికి సంబంధించిన ఆరు కోట్ల నగదు నీ ఖాతాలో ఎలా జమ అయ్యాయి..? అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను అని పట్టణానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన అధికారికి సైబర్ నెరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేసిన సంఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

2 /5

ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ధర్మపురి పట్టణంలో ఆర్థిక సంక్షేమ లావాదేవీలు నిర్వహించే సంస్థ కీలక అధికారికి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఇన్వెస్టిగేషన్ అధికారిని మాట్లాడుతున్నాను అంటూ మూడు రోజుల క్రితం ఒక ఫేక్ కాల్ వచ్చిందట..  

3 /5

ఆ ఫోన్ మాటల సారాంశం ఏమిటంటే.. మేము శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర రూ.6వేల కోట్ల బిట్ కాయిన్ మోసం కేసులో విచారణ చేపట్టాము. అందులో మీ ఖాతాకు అతడు సంస్థ నుంచి రూ.6 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.  ఇది ఎందుకు బదిలీ అయింది అంటూ సైబర్ మోసగాళ్లు అధికారిని విచారణ పేరుతో ఫోన్లో ప్రశ్నించినట్లు తెలిసిందే.  దాదాపు నాలుగు గంటల పాటు అధికారిని వివరాలు విచారణ పేరిట సైబర్ మోసగాళ్లు పూర్తిగా భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. 

4 /5

అయితే కేస్ ఫైలింగ్ చార్జీల పేరుతోనో,  ప్రాథమిక నివేదిక వివరాల ఫైలింగ్ చార్జీల పేరిటనో తెలియదు కానీ రెండు విడతలలో వేలాది రూపాయలు వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్ కి ఆ అధికారి తన ఖాతా నుండి బదిలీ చేసినట్లు సమాచారం. అయితే ఈడి పేరిట ఫోన్ రావడంతో భయానికి గురైన ఆ ఉద్యోగి,  ఇతర అధికారులతో ఫోన్ కాల్ ఉదంతం వివరించినట్లు సమాచారం. 

5 /5

ఇక స్పందించిన ఉద్యోగులు.. సార్ ఇది సైబర్ మోసగాళ్ల పని అని వివరించగా ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు శిల్పా శెట్టి భర్తను కూడా వదలకుండా ఆయన పేరును ఉపయోగించుకొని ఇలాంటి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.