Gold Price Forecast: ట్రంప్ విజయోత్సాహంతో భారీగా తగ్గనున్న బంగారం ధర.. ఎంత పడుతుందో తెలిస్తే మహిళలు పండగే

Gold Price: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం బాటలో ఉన్న నేపథ్యంలో భారత్ లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంచనాలు వెలవాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు ఏ మేరా తగ్గనున్నాయి.  ఇప్పుడు మనం తెలుసుకుందాం

1 /7

Gold Rate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా ధరలను పరిశీలిస్తే నవంబర్ 6వ తేదీ బుధవారం బంగారం ధర ఇలా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,070 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలుగా పలుకుతోంది.   

2 /7

బంగారం ధరలు ప్రస్తుతం అమెరికా మార్కెట్లో నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి బాధ్యతలు చేపడతారని ఎన్నికల ఫలితాలను బట్టి విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. 

3 /7

ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రంప్ వస్తున్నాడని పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ వైపు తమ పెట్టుబడులను తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం వైపు నుంచి పెట్టుబడులు స్టాక్ మార్కెట్ వైపు తరులుతాయి. దీంతో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

4 /7

ప్రస్తుతం బంగారం ధర అమెరికాలో ఒక ఔన్స్ 2750 డాలర్ల వద్ద ఉంది. అయితే భవిష్యత్తులో బంగారం ధర ఒక ఔన్స్ 2500 డాలర్లకు పడితే, మనదేశంలో కూడా బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మన దేశంలో బంగారం ధర ప్రస్తుతం ఉన్న 81 వేల నుంచి, రూ. 70 వేల వరకు పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

5 /7

బంగారం ధరలు గడచిన మూడు నెలలుగా దాదాపు 19 వేల రూపాయల వరకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే బంగారం ధర దాదాపు 20 వేల రూపాయలు పైన పెరిగింది. దీనికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఒక కారణంగా చెప్పవచ్చు.   

6 /7

అయితే రిపబ్లిక్ అని అభ్యర్థి ట్రంప్ గెలుపు బాటలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన అధ్యక్షుడు అయితే అమెరికా మార్కెట్లలో తిరిగి పునరుజ్జీవం వస్తుందని, ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పిలుస్తున్న బంగారం నుంచి పెట్టుబడులు నెమ్మదిగా స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్స్ వైపుకు తరలి వెళ్లే అవకాశం ఉందని.   

7 /7

ఫలితంగా బంగారం ధర తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర భవిష్యత్తులో భారత దేశంలో 70 వేల నుంచి 65 వేల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది.