KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. దీంతో త్వరలోనే కేటీఆర్ కార్నర్ చేసి అరెస్ట్ చేస్తారని రాజకీయ, మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈరేసింగ్ వ్యవహారంలో త్వరలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కానున్నట్లు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశారు. దీనికి గవర్నర్ న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాదు అప్పటి రాజకీయ పెద్దలను కూడా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే అప్పట పురపాలక సీఎస్ అర్వింద్ కుమార్‌పై చర్యలకు ప్రభుత్వానికి ఏసీబీ కోరగా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈరేసింగ్ ఎలా నిర్వహించారని మున్సిపల్ శాఖల రికార్డులను పరిశీలిస్తోంది. త్వరలో నోటీసులు ఇచ్చే యోజనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఈ రేసింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పటికే రెండు సీజన్లు నిర్వహించారు. అయితే, లాభాలు రాకపోవడంతో నిర్వాహకులు ఆసక్తి చూపలేదు
విదేశీ కంపెనీలకు దాదాపు రూ.55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇది కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తుంది. దీనికి సంబంధించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు ఏసీబీ పిలవనుంది.
ఈ రేసింగ్‌లో పర్మిషన్ లేకుండా విదేశీ సంస్థకు ఇలా చెల్లింపులు ఏ ప్రాతిపదికనా చెల్లించారనేది తేల్చనున్నారు. అంత పెద్ద మొత్తం ఓ విదేశీ సంస్థకు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి కూడా ఉండాలి. ఈ కేసులో ఏదైనా అవకతవకాలు బయటకు వస్తే బీఆర్ఎస్ టాప్ మోస్ట్ లీడర్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయన్నట్లు తెలుస్తోంది.
ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి? 2022 లో హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన నెక్లేస్రోడ్లో గత ప్రభుత్వం ఈ రేసింగ్ ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి ఓ రెండు సీజన్లు కూడా నిర్వహించింది. ఒక సీజన్ నిర్వహించిన తర్వాత రెండో సీజన్‌కు ప్రమోటర్ ఆసక్తి చూపలేదు. అయితే, రద్దు కూడా చేసుకోలేదు. కానీ, మున్సిపల్ శాఖ ద్వారా ముందస్తుగా రూ.55 కోట్లను చెల్లించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ సంస్థలో ఒప్పందం రద్దు చేసుకుంది. న్యాయపరంగా కేసును ముందుకు తీసుకు వెళ్లడానికి గవర్నర్ అనుమతి తీసుకుంటున్నారు. అనుమతి వచ్చిన వెంటనే అవతవకలు తేలితే అప్పటి సీనియర్ అధికారులతోపాట కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.