Anchor Pradeep: మహిళా ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ ప్రేమయాణం.. ట్రెండింగ్‌లో సీక్రెట్‌ లవ్‌స్టోరీ

Anchor Pradeep Lovestory: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రేమయాణం నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో ఓ మహిళా ఎమ్మెల్యేతో ఆయన లవ్‌లో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ వస్తోంది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై ఫుల్‌ బిజీగా ఉన్న ప్రదీప్.. త్వరలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీతో ప్రేక్షకులను అలరించనున్నాడు.
 

1 /8

ఆర్జేగా కెరీర్ ఆరంభించిన ప్రదీప్.. ఆ తరువాత యాంకర్‌గా మారాడు. తనదైన యాంకరింగ్‌తో మేల్ యాంకర్స్‌లో టాప్‌ ప్లేస్‌లోకి వచ్చాడు.  

2 /8

ఒక్కో షోతో తన స్పెషాలటీతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక ఛానెల్‌కే పరిమితం కాకుండా అన్ని ఛానెల్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు.  

3 /8

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించిన ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అనే సినిమాతో హీరోగా మారాడు.  

4 /8

ప్రస్తుతం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.  

5 /8

ప్రదీప్ వయసు నాలుగు పదులు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌గానే ఉన్నాడు. అయితే ఏపీకి చెందిన కూటమి ఎమ్మెల్యేతో ప్రదీప్ ప్రేమలో ఉన్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.  

6 /8

గత రెండేళ్ల నుంచి ఆమెతో ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు.  

7 /8

ఆ ఎమ్మెల్యే విదేశాల్లో చదువుకున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

8 /8

వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది..? ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది..? పెళ్లి ఎప్పుడు..? అనే విషయాల కోసం నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు.