Telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్‌ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!

500 Rupees Bonus For Paddy: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో డబ్బులు నిన్న శనివారం జమా చేసింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. కోటీ రూపాయల చెక్కులపై సంతకం చేయడంతో రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమా అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కోటి నెరవేరుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.  

2 /5

ఆ తర్వాత ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, కొంతమంది రైతులకు రుణమాఫీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది.  

3 /5

రైతుల ఖాతాల్లో నిన్న శనివారం రేవతంత్‌ ప్రభుత్వం రూ.500 బోనస్‌ డబ్బులను జమా చేసేందుకు సివిల్‌ సప్లై కోటీ రూపాయలకు పైగా చెక్కులపై సంతకాలు జారీ చేసింది. దీంతో రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమా కానున్నాయి.  

4 /5

తాము అధికారంలోకి వస్తే క్వింటాకు సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామన్న రేవంత్‌ సర్కార్‌ హామీని నిలబెట్టుకుంది. ఈమేరకు మొన్న ఓ రైతు ఖాతాల్లో శాంపిల్‌గా డబ్బు జమా చేసింది. ఇలా నిన్న నవంబర్ 16న రైతులకు బోనస్‌ డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం.  

5 /5

తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 500 క్వింటాకు సన్నవడ్లపై బోనస్‌ డబ్బులను కూడా 48 గంటల్లో చేరడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బైపోతున్నారు