Rosemary Oil Remedies: ఇటీవలి కాలంలో ఇమ్యూనిటీపై అవగాహన పెరుగుతోంది. ఇమ్యూనిటీ పెంచుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. అదే సమయంలో కేశాల సంరక్షణ చాలా అవసరం. ఇలాంటి సమస్యలకు సమాధానమే రోజ్మేరీ ఆయిల్. రోజ్మేరీ ఆకుల నుంచి తీసే ఆయిల్ ఇది. కేవలం కేశాల సంరక్షణకే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
రోజ్మేరీ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ దూరం చేస్తుంది
రోజ్మేరీ ఆయిల్ హెయిర్ ఫాలిక్యుల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంతో కేశాల ఎదుగుదుల బాగుంటుంది. అంతేకాకుండా జుట్టు రాలకుండా విరగకుండా ఉంటుంది. స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
రోజ్మేరీ ఆయిల్ వాసనతో రెస్పిరేటరీ ద్వారం ఓపెన్ అవుతుంది. ముక్కులో తలెత్తే కంజెషన్ దూరమౌతుంది. ఆస్తమా, ఎలర్జీ, జలుబు దూరమౌతాయి.
రోజ్మేరీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ చర్మానికి రాయడం వల్ల పింపుల్స్, స్వెల్లింగ్ సమస్య దూరమౌతుంది. చర్మ సంరక్షణ మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ సహాయంతో రక్త ప్రసరణ పెరుగుతుంది.
రోజ్మేరీ ఆయిల్లో ఎనాల్జెసిక్ గుణాలు ఎక్కువ. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, తలనొప్పి వంటివి తగ్గుతాయి.