Gold Loan Good News: గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి RBI బంపర్‌ గుడ్‌ న్యూస్‌.. ఎరిగి గంతేయడం ఖాయం!

Gold Loan Good News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంగారం కేవలం పెట్టుకోవడానికి నగ మాత్రమే కాదు.. ఇది ప్రస్తుతం కష్టకాలాల్లో కూడా అద్భుతమైన ఆర్థిక మార్గాలను చూపిస్తూ వస్తోంది. కొందరికి కష్ట సమయాల్లో ఇదే బంగారం నగదుగా కూడా మారి ఆదుకుంటోంది. డబ్బు అత్యవసరంగా కావాల్సినప్పుడు తక్కువ వడ్డీ రేటుగా ఉన్న గోల్డ్ లోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు.

1 /6

ప్రస్తుతం చాలా మంది అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటున్నారు. అలాగే ఈ గోల్డ్‌ లోన్స్‌ పెరగడం కారణంగా చాలా బ్యాంక్‌ దీనిని దృష్టిలో పెట్టుకుని లోన్ ప్రాసెస్‌పే కూడా సులభతరం చేశాయి.   

2 /6

అవసరాలను బట్టి గోల్డ్‌ లోన్‌ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అలాగే ఈ లోన్‌ తీసుకునేవారి శాతం పెరగడంతో RBI కీలక నిర్ణయం తీసుకుంది. అయితే లోన్‌ తీసుకుంటే వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం లేకుండా పోయింది.

3 /6

గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలోనే గుడ్‌న్యూస్‌ తెలపబోతోంద. ఈ లోన్‌ తీసుకున్నవారు వాయిదా పద్ధతి (EMI) ద్వారా చెల్లించే పద్ధతిని కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

4 /6

ప్రస్తుతం చాలా గోల్డ్‌ లోన్‌ కంపెనీలు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్‌ ద్వారా చెల్లించే ఆప్షన్‌ను అందిస్తోంది. దీని ద్వారా గోల్డ్‌ పెట్టి అమౌంట్‌ తీసుకున్న వారు లోన్‌ అమౌంట్‌ ఒక్కసారి చెల్లించాల్సి ఉండేది. దీనికి సర్టెన్‌ టైమ్‌ పట్టేది..

5 /6

అలాగే గోల్డ్‌ లోన్‌ తీసుకునేవారు టెన్యూర్ పూర్తయిన తర్వాత తిరిగి డబ్బులు చెల్లించేవారు.. దీని వల్ల లోన్‌ తీసుకు వారి వద్ద డబ్బులు ఉన్న కట్టే పరిస్థితి లేకపోయింది. అంతేకాకుండా వడ్డీ మొత్తం కూడా చెల్లించేవారు.. 

6 /6

ఇటీవలే గోల్డ్‌లోన్‌ భాగంగా జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని RBI ముందుగా వడ్డీ కింది తక్కువ మొత్తం అమౌంట్‌ చెల్లించి.. గోల్డ్‌ విడిపించుకుని EMI ఆప్షన్‌ ద్వారా పూర్తి అమౌంట్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకు వస్తోంది.