Rishabh Pant Net Worth: రిషభ్ పంత్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన పంత్‌ను వచ్చే ఐపీఎల్ నుంచి సరికొత్త జెర్సీలో చూడనున్నాం. పంత్ నెట్‌వర్త్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో 4 అక్టోబర్ 1997లో పంత్ జన్మించాడు. చిన్న వయసు నుంచే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తూ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో పంత్ అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన తరువాత అతని ఆస్తుల విలువ గురించి ఎక్కువ మంది వెతుకుతున్నారు. 2024 నాటికి పంత్ నికర విలువ రూ.100 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-2025 వేలం తరువాత పంత్ ఆస్తుల విలువ మరింత పెరిగింది. రూ.127 కోట్లకు చేరింది. ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్టులు కాకుండా అడ్వటైజ్‌మెంట్ ద్వారా పంత్ గట్టిగానే సంపాదిస్తున్నాడు.
వచ్చే ఏడాదిలో లక్నో టీమ్ నుంచి రూ.27 కోట్లు, బీసీసీఐ నుంచి ప్రతి ఏడాది రూ.3 కోట్లు పంత్ అందుకోనున్నాడు.
ఇవి కాకుండా ఒక టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3 లక్షలు అర్జిస్తున్నాడు.
పంత్ అడిడాస్, JSW, Dream11, Realme, Cadbury, Zomato వంటి టాప్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.
ఢిల్లీ, రూర్కీలలో రెండు ఇళ్లు ఉండగా.. వాటి విలువ రూ.2 నుంచి 3 కోట్లు ఉంటుందని సమాచారం. ఇవి కాకుండా ఖరీదైన కార్లు కూడా పంత్ వద్ద ఉన్నాయి.
యాక్సిడెంట్ తరువాత కొలుకుని వచ్చిన తరువాత రిషభ్ పంత్ సరికొత్త ఆటతీరుతో మెస్మరైజ్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో మరింత దూకుడు పెంచగా.. కీపింగ్‌లో అదరగొడుతున్నాడు.