Top 10 Highest Expensive Players in IPL: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో సరిగా ఆడని ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేసేందుకు అన్ని టీమ్‌లు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. మినీ వేలానికి ముందు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.
Rishabh Pant Dishonoured To Virat Kohli: భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ చేసిన ఒక పని తీవ్ర దుమారం రేపుతోంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అవమానించాడని నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ జెర్సీ ధరించాడని బీసీసీఐతోపాటు పంత్‌పై అభిమానులు చెలరేగిపోతున్నారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Rishabh Pant Birthday: చిన్న పట్టణం నుంచి గురుద్వారాలో బస చేస్తూ, లంగర్లో తింటూ ప్రాక్టీస్ చేసిన కుర్రాడు నేడు టీమ్ ఇండియాలో స్టార్ వికెట్ కీపర్‌గా వెలుగొందుతున్నాడు. 18 ఏళ్లకే అండర్-19 వరల్డ్ కప్‌లో సెంచరీతో పాటు ఐపీఎల్ వేలంలో కోట్ల వర్షం కురిపించిన రిషబ్ పంత్, 2022లో ప్రమాదంలో గాయపడినా కేవలం 15 నెలల్లోనే కోలుకుని టీ20 ప్రపంచ కప్ గెలిపించాడు. అతని జీవితం కష్టాలు, పోరాటం, విజయాలతో నిండిన అసలైన ప్రేరణ కథ అని చెప్పవచ్చు. నేడు టీమిండియా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ పంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జీ తెలుగు స్పోర్ట్స్ విభాగం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ బర్త్
Rishabh Pant's Health Secret: టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కు లార్డ్స్ టెస్టులో వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పుడు కీపింగ్ చేయలేకపోయాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడిన పంత్ కుడి కాలికి బంతి తగిలి తీవ్ర గాయమైంది. పంత్ కు గాయాలు కొత్తేమీ కాదు. కొన్నేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఆ సమయంలో పంత్ కోలుకోవడంలో కిచ్డి ముఖ్య పాత్ర పోషించింది. ప్రమాదం తర్వాత పంత్ కిచ్డీ మాత్రమే తిన్నాడట. ఇది అతన్ని త్వరగా కోలుకునేందుకు సహాయపడిందని పంత్ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా కిచ్డికి సంబంధింకి ప్రయోజనాల గురించి చెప్పారు. ప్రతిరోజూ కిచ్డి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో
Rishabh Pant Annual Income: ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడడమే రిషబ్ పంత్ స్పెషాలిటీ. టీ20, వన్డేల్లో కంటే.. టెస్ట్‌ల్లో పంత్ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఎక్కువ ఇష్టపడుతారు. సరికొత్త షాట్లతో అలరిస్తూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌తో రివర్స్ స్వీప్ ఆడబోతే.. కాలికి గాయమైంది. గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. మళ్లీ క్రీజ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. గాయం కారణంగా చివరి టెస్ట్ నుంచి పంత్ తప్పుకున్నాడు. రిషబ్ పంత్ ఆస్తుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
IND Vs ENG Pant Batting: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తీవ్రంగా గాయపడ్డాడు స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్. కాలికి తీవ్రంగా గాయమైన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అన్నారు. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత మాట్లాడిన కోచ్ సితాన్షు.."రేపు పంత్ బ్యాటింగ్ చేస్తాడు" అని వెల్లడించాడు.
Jofra Archer clean bowled Rishabh Pant: 4వ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్ భారత తొలి ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లను తిరిగి పెవిలియన్‌కు పంపాడు. కాలుగాయంతో బాధపడుతున్నప్పటికీ రిషభ్ పంత్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. కానీ చివరికి ఆర్చర్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. వికెట్ తీసిన సంబురంలో ఆర్చర్ కాలితో వికెట్ ను తన్నిన వీడియో వైరల్ అయ్యింది.
Pant Injury: ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌లో కొత్త వికెట్ కీపర్ జట్టులో చేరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ గాయం కారణంగా అతను వచ్చే మ్యాచ్‌కు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో మరో కొత్త వికెట్ కీపర్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించిందట.
India Vs England 4th Test Updates: మాంచెస్టర్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
IND vs ENG 4th Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జులై 23వ తేదీ నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డులో ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో భారత్ ఏకంగా ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ ఎందుకు ఈ వింత నిర్ణయం తీసుకున్నాడనేది తెలుసుకుందాం.
IND Vs ENG Test : ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన 3వ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 22 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియా గెలవడానికి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దీనికి ప్రతిస్పందనగా భారత జట్టు 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
India Breaks The Birmingham Jinx 58 Records Against England 2nd Test: ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు భారీ విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ విజయంతో 58 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. రెండో టెస్ట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
Team India Celebrates 2024 T20I World Cup Win: జూన్ 29న టీం ఇండియా టీం కేక్ కట్ చేసి 2024 టీ20 ప్రపంచ కప్ విజయానికి సంబంధించి మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకున్నారు. ఈ సమయంలో రిషబ్ పంత్ తన T20 రిటైర్మెంట్ గురించి రవీంద్ర జడేజాను సరదాగా ట్రోల్ చేశాడు.
IND vs ENG : మూడవ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సన్నివేశాల చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్ 465 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. బ్రూక్ 99 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది.
IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ ముగిసి పట్టుమని రెండు రోజులైనా కాలేదు. అప్పుడే కొన్ని జట్లు కోచింగ్ సిబ్బంది మార్చే పనిలో బిజీగా మారారు. వరుసగా రెండుసార్లు సీజన్లలో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ తన టీమ్ లో మార్పులకు సిద్ధం అవుతోంది.
IPL 2025 RCB vs LSG: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు చేయడంతో ఆర్సీబీ టాప్-2లో నిలిచింది. అయితే మ్యాచు సమయంలో దిగ్వేష్ రాఠి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో జితేష్ శర్మను మన్కడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అప్పీల్‌ను విత్ డ్రా చేసుకున్నాడు. అయితే ఈ చర్యపై విరాట్ కోహ్లీ చాలా గుస్సా అయ్యాడు.
Rishabh Pant's cost per run in IPL 2025: IPL 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 54 బంతుల్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండవ సెంచరీ. లక్నో తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. కానీ ఈ సీజన్ పంత్ కు అంతగా కలిసి రాలేదు. ఈ సీజన్‌లో పంత్ ఒక్క పరుగుకు ఎంత ఖర్చయిందో తెలుసా?
Top 10 Fielding Blunders Of LSG Players Against RCB: ఏందిరా అయ్యా చిన్నపిల్లలుగా ఆడుతున్నారు? అసలు మీరు ప్రొఫెషనల్ ఆటగాళ్లా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. మీకన్నా పిల్లలు నయం కదారా అనే రీతిలో లక్నో సూపర్ జియాంట్స్ చెత్త ఫీల్డింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Royal Challengers Bengaluru Beat Lucknow Super Giants By 6 Wickets: ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీకి చేరువైంది. ప్లేఆఫ్స్‌లో టాప్ 2లో ఉండాలనే కసితో ఆడిన బెంగళూరు లక్ష్యం సాధించింది. ఓటమితో లక్నో ఐపీఎల్ 2025 సీజన్ ను ముగించింది.
Rishabh Pant What Drunken In RCB Match In IPL 2025: మెగా వేలంలో అత్యధిక ధరతో ఐపీఎల్ రికార్డులను తిరగరాసిన రిషబ్ పంత్ ఎట్టకేలకు తాను తీసుకున్న డబ్బులకు న్యాయం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లోనే తొలి సెంచరీ నమోదు చేయడం.. సెంచరీ ఆనందంలో అతడి సంబరాలకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.