Telangana: విజయోత్సవాల ముందు కీలక పరిణామం.. సీఎం రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా!

Big Shock To Cm Revanth: ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున, కేటీఆర్‌లు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసారి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ కేసు ఎవరు వేశారు? ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం...
 

1 /5

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కుతో రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రతి పక్షాలు ఢీ అంటే ఢీ అంటూ సీఎంగా దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్కో పథకం అమలు చేస్తూ వస్తున్నారు.   

2 /5

డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో విజయోత్సవాలు కూడా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా 9 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా ఫైలయింది. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌.  

3 /5

ఇప్పటికే మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరూ విడివిడిగా పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు.  

4 /5

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు సీఎం రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తప్పుడు ఆరోపణలు సీఎం రేవంత్‌ చేశారని, దీనివల్ల దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీకి కూడా తీవ్ర పరువు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.   

5 /5

నాంపల్లి హైకోర్టు ధర్మాసనం ముందు పిటిషనర్‌ న్యాయవాది నిన్న (గురువారం) పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ జరిగిన తర్వాత ఈ కేసు డిసెంబర్‌ 11వ తేదీకి వాయిదా పడింది. నాగార్జున వేసిన పరువు నష్టం దావా విషయంలో కూడా ధర్మాసనం కొండా సురేఖకు కీలక ఆదేశాలు చేసింది.