Mla kavvampalli Satyanarayana row: నువ్వు ఎమ్మెల్యే కాకముందు గోసి గొంగడితో వచ్చావని, ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని మాన కొండూరు ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్ పై మండిపడ్డారు .అంతే కాకుండా ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు.
Konda Surekha To Join YSRCP: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో చేరనున్నట్లు, తద్వారా తెలంగాణలో ఆ పార్టీని నడిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
DK Aruna Supports To Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం బాధాకరం అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆమెను తొలగించడం కాంగ్రెస్‌లోని అంగర్గత విభేదాలే కారణమని ప్రకటించారు. జడ్చర్లలో జరిగిన కార్యక్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
G Chinna Reddy First Reaction After Planning Commission Chairman: తనకు పదవులపై సోకు లేదని.. కానీ ఒక్క పోటుతో కూల్చేశారని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి తెలిపారు. తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చాననని.. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తుచేశారు. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు.
Konda sushmita: ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మను సీఎంరేవంత్ రెడ్డి అనేక మార్లు అవమానించారని కొండా సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. BCలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఎద్దేవా చేశారు.
Konda Surekha Press Meet: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. తీవ్ర చర్యలు తీసుకోవడంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి తనపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించడం చాలా బాధాకరం అని చెప్పారు. కారణం చెప్పకుండా తనను తొలగించారని పేర్కొన్నారు. మంత్రి పదవి పోయిందనే బాధ తనకు లేదని.. పదవి ఒక ఆభరణంగా కొండా సురేఖ తెలిపారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ దంపతులు రాజీనామా చేస్తారనే వార్తలు జోరు అందుకున్నాయి.
CM Revanth reddy: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు ఇప్పటికే సిఫారసు పంపించారు.
Konda Surekha controversy: కొండా సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో ఫిక్స్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS Party Leaders Chants Govinda Govinda: రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పరిపాలనతో ప్రజలకు నరకప్రాయంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్లు పద్మారావు గౌడ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫలమండి చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 420 హామీలపై గోవింద గోవిందా అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
Konda Surekha: కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సంచలనవ్యాఖ్యలు చేశారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పన్నారు. నన్ను ఏమైనా చేయాలి అంటే ఏఐసీసీనే చేయాలని, ఎందుకంటే నేను ఏఐసీసీ సభ్యురాలినని చెప్పుకొచ్చారు. నన్ను టార్గెట్ చేసి, నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. తన మీద వ్యాఖ్యలు చేసిన వారు వెనుకాల ఎవరున్నారో తెలుసన్నారు. మీనాక్షి మేడంకు నేను చెప్పాల్సింది అంతా చెప్పానన్నారు.
Konda surekha fires on cm revanth reddy: నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందని తన కూతురు వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదన్నారు. మరోవైపు నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు అని.. మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Rajgopal Wants Become CM: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతి స్వరం వినబడుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో తానే ముఖ్యమంత్రిగా అవుతానంటూ స్వయం ప్రకటన చేసుకున్నారు. సరైన సమయం వస్తే తాను సీఎం అవ్వడం ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి.. మళ్లీ వైఎస్సార్ రాజ్యాన్ని స్థాపిస్తానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Komatireddy Rajgopal Reddy Hot Comments: సొంత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని.. తాను కానివ్వనని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి కూడా అవుతానని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ktr fires on cm revanth reddy: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనికి నేటితో 1000 దినాలయ్యిందన్నారు. అంతే కాకుండా.. తెలంగాణపై దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి 1000 రోజులు గడిచిందని ఎద్దేవా చేశారు.
Konda surekha controversy: ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బాటపట్టారు. మరోవైపు కొండా సురేఖకు కూడా ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Kavitha Vs Vemula Prashanth reddy: కవిత ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా తన ఉసురు తప్పకుండా ప్రశాంత్ కుమార్ కు తగులుతుందని ఎద్దేవా చేశారు.
K Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కవిత మరోసారి వార్తల్లో నిలిచారు. భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైన ఆమె ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కవిత గతంలోనూ శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం సందర్భంగా పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న ఘటన నమోదైంది.
Mahesh Goud: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం ఈ మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు.
Telangana CM Revanth Reddy Sensational comments: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపైముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరిస్తున్నారంటై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు చెల్లించలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే రోజు జీతాలు చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు తనను బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Dubbaka Politics: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పొలిటికల్ గేమ్ నడుస్తోంది..! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ పోటాపోటీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉంటున్నారు..! వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటే టార్గెట్‌గా క్షేత్ర స్థాయిలో బలపడేందుకు నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు..! ఇదంతా ఒక వైపు అయితే.. ఇప్పుడు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగ రెడ్డి తనయుడు సతీష్ రెడ్డి తెర పైకి వచ్చారా..! ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని సతీష్ ప్రకటించడంతో దుబ్బాకలో రాజకీయ వేడి మొదలైందా..! సతీష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపై దుబ్బాకలో ఎలాంటి చర్చ జరుగుతోంది..!
Once Again Konda Surekha Name And Photo Missed: మంత్రి కొండా సురేఖను అనధికారికంగా తొలగించారా? అంటే ఔననే సమాధానాలు ఇస్తున్నాయి. వరుసగా అధికారిక కార్యక్రమాల్లో ఆమె ఫొటోలు, పేర్లు వాడడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా కొండా సురేఖ పేరు, ఫొటో కనిపించలేదు.
BRS Samarabheri: తెలంగాణలో మరోసారి పవర్ లోకి రావాలని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది..! కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై సమరభేరీ మోగించేందుకు రెడీ అయ్యింది..! సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు హైకమాండ్ పిలుపునిచ్చింది..! ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నిత్యం జనంలోనే ఉంటూ.. క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు..! కానీ పార్టీలో చాలామంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారా..! అప్పడప్పుడు తెలంగాణ భవన్‌కు వచ్చి సమావేశాలకే పరిమితం అవుతున్నారా..! ఇప్పటికే పార్టీ హైకమాండ్ పిలిచి కొందరు నేతలను మందలించినా.. వాళ్లు మాత్రం మారడం లేదా..! దాంతో పార్టీలో యాక్టివ్‌గా లేని నేతలకు టికెట్ కట్ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..!