Boult Drift+ Bluetooth Calling Smartwatch: ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపు ధరకే బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Boult Drift+ Bluetooth Calling Smartwatch: మార్కెట్‌లో బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్సతో బోల్ట్ కంపెనీ అతి తక్కువ ధరల్లోనే స్మార్ట్‌వాచ్‌లను విక్రయిస్తూ వస్తోంది. మీరు కూడా ఎప్పటి నుంచో మీ ఫ్రెండ్‌కి స్మార్ట్‌వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకంగా అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) స్మార్ట్‌వాచ్ 14 కలర్ ఆప్షన్స్‌తో పాటు నాలుగు డిస్ల్పే సైజుల వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 1.85 అంగుళాల డిస్ల్పే కలిగిన వాచ్ ధర MRP రూ.8,499లుగా విక్రయిస్తోంది.
దీని ధర మార్కెట్‌లో MRP రూ.8,499 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా 87 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కేవలం రూ.1,099కే అందుబాటులో ఉంది.
ఇక ఈ వాచ్‌ను అత్యంత తగ్గింపు ధరకు కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. దీనిని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ లభిసుంది.
ఇక ఈ బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1.85 అంగుళాల HD స్క్రీన్‌తో వస్తోంది. అంతేకాకుండా 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే అనేక రకాల హెల్త్ మానిటర్ సెన్సార్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఇందులో కంపెనీ SpO2 బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ మానిటర్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఫిమేల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటర్, డ్రింక్ వాటర్ రిమైండర్ ఫీచర్స్ కూడా ఉంటాయి.