IRCTC: మీరు ప్రయాణించే రైలు ఆలస్యమైందా? ఐఆర్‌సీటీసీ ఫ్రీ భోజనం అందిస్తుందని తెలుసా?

IRTCTC Free Meal: మనం ప్రయాణించే ట్రైన్ ఆలస్యం ఒక అయితే ఇక ఫ్రీగా భోజనం పొందవచ్చని మీకు తెలుసా? ఐఆర్టిసిటి ఉచిత భోజనం అందిస్తుంది. ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఎలా పొందాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలని ట్రైన్‌ టక్కెట్ బుక్‌ చేసుకుంటాం. ప్రయాణ సమయానికి గంట ముందే రైల్వే స్టేషన్‌ చేరుకుంటాం. లేకపోతే ట్రైన్‌ మిస్‌ అయిపోతుంది. అయితే, ఒక వేళ ట్రైన్‌ ఆలస్యమైతే? ఏం జరుగుతుంది.  

2 /5

ప్రయాణం చేసే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటాం. అయితే, సమయానికి ట్రైన్‌ బయలు దేరకపోతే ఐఆర్టిసిటి ఉచిత భోజనం అందిస్తుంది. ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఉచితంగా ఈ సర్వీస్ ను అందిస్తుంది.  

3 /5

ప్రస్తుతం ఈ సేవ రాజధాని, శతాబ్ది ,దూరాన్ధో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైలలో అందుబాటులో ఉంది కాఫీ బిస్కెట్లతో పాటు ఇతర భోజనం కూడా ఆర్డర్ చేయొచ్చు.  

4 /5

ఒకవేళ మీరు ట్రైన్ ఎక్కక ముందే మూడు గంటల కంటే ఎక్కువ సమయం ట్రైన్ ఆలస్యం అయితే టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తుంది. అంతేకాదు ఇందులో వెయిటింగ్ రూమ్స్ లో అదనపు చార్జీలు కూడా నీ నుంచి వసూలు చేయరు.  

5 /5

ప్రయాణికులు సమయాన్నిబట్టి బ్రేక్ ఫాస్ట్ లంచ్ స్నాక్స్ రాత్రి భోజనం ఆర్డర్ చేసే సదుపాయం కల్పించారు రన్నింగ్ ట్రైన్ కూడా ఆర్డర్ చేసే సౌకర్యం కల్పించారు. మీరు చేరే తదుపరి గమ్యస్థానంలో ఈ ఫుడ్‌ పొందుతారు.