Keerthy Suresh Anthony Wedding: కీర్తి సురేష్ పెళ్లికి ధరించిన చీర కోసం 405 గంటలు పట్టిందట. దీని ధర సుమారుగా మూడు.. లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ఈ చీరలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అంత సమయం పట్టడానికి ఈ చీరలో ఏముంది.. అనేది ఎంతో మంది ప్రశ్న. పూర్తి వివరాలకు వెళితే
మహానటి కీర్తి సురేష్ ఎట్టకేలకు తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ తో ఏడడుగులు వేసింది. 15 సంవత్సరాల ప్రేమకు స్వస్తి పలుకుతూ వివాహం చేసుకున్నారు.
ఇక కీర్తి కుటుంబం ఆచారాలకు అనుగుణంగా సాంప్రదాయ బ్రాహ్మణ శైలి లో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆంటోనీ మత విశ్వాసాన్ని కూడా గౌరవిస్తూ క్రైస్తవ పద్ధతిలో కూడా ఒక చర్చిలో వీరి వివాహం జరిపించారు.
ఇకపోతే కీర్తి తర్వాత సాంప్రదాయ హిందూ వధువుగా అలంకరించుకుంది. బ్రాహ్మణ పద్ధతిలో కీర్తి సురేష్ అలంకరించుకున్న తీరును బట్టి చూస్తే ఆమె కుటుంబ వారసత్వం పట్ల భక్తిని ప్రదర్శించింది.
ఇకపోతే కీర్తి సురేష్ పెళ్లి చీర అందరి దృష్టిని ఆకర్షించింది. కాంచీపురంలో నేసిన మడిసర్ పట్టు. దాని ధర రూ.3లక్షల పైమాటే.
ఈ చీరను ప్రీమియం సిల్క్ థ్రెడ్ తో తయారు చేశారు. క్లిష్టమైన బంగారు జరీ వర్క్ తో నేసారు. సుమారుగా 405 గంటలు పట్టిందట. అలాగే ఆంటోనీ పట్టు ధోతీ ,శాలువా ధరించారు. దీనిని తయారు చేయడానికి 150 గంటలు పట్టిందని సమాచారం. వ్యక్తిగత టచ్ జోడించి కాస్ట్యూమ్ డిజైన్లు నైపుణ్యం ఉన్న కీర్తి తన పెళ్లి చీరను స్వయంగా డిజైన్ చేసింది.