Pushpa 2 collections day 14: పుష్ప 2.. 14 రోజుల్లోనే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందంటే..?

Pushpa 2 box office collection: పుష్ప 2 ది రూల్.. సినిమా పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోని నిర్మించారు.. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లో విడుదలై మొదటి రోజు హిట్ టాక్ తో దూసుకుపోయింది.

1 /5

2021 లో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమాకి సీక్వెల్ గానే పుష్ప ది రూల్ సినిమాని తెరకెక్కించారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే రాబడుతూ పలు రకాల రికార్డులను తిరగరాస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 మేనియా కొనసాగుతూనే ఉంది.

2 /5

ఇకపోతే డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్లు సునామి కురిపిస్తోంది ముఖ్యంగా బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా.. ఎవరు ఊహించని విధంగా మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

3 /5

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ లో మొదటి రోజు కలెక్షన్లు సాధించిన సినిమా ఇప్పటివరకు రాలేదనడంలో సందేహం లేదు అలా మొదటిసారి కొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. ఐదు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల జాబితాలో పుష్ప2 సినిమా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

4 /5

ఇకపోతే 13 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక్క ఇండియాలోనే 953.3 కోట్ల రూపాయలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక 14 రోజుల్లోనే ఇండియాలో రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా. 

5 /5

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకి 14 రోజుల్లో రూ. 1400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. బన్నీ గనుక అరెస్టయ్యి ఉండకపోయి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.