Latest New Year Business Idea: కొత్త ఏడాదిలో కొత్త బిజినెస్‌.. అతి తక్కువ పెట్టుబడితో.. రూ.2 లక్షల ఆదాయం!!

Dry Fruits Small Business Idea: బిజినెస్‌ ప్రారంభించాలని మనలో చాలా మంది కలలు కంటారు. ముఖ్యంగా నేటి కాలం యువతకు కూడా బిజినెస్‌ల వైపు మక్కువ చూపుతున్నారు. బిజినెస్‌ నిపుణుల ప్రకారం ఏ వ్యాపారాన్ని అయిన తక్కువ పెట్టుబడితో కూడా ఆకర్షణీయంగా  ప్రారంభించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మీకు ఏదైనా హాబీ ఉంటే దానిని వ్యాపారంగా మార్చవచ్చు. ఉదాహరణకు వంట చేయడం ఇష్టమైతే హోమ్‌మేడ్ ఫుడ్‌ను తయారు చేసి అమ్మవచ్చు. ఫ్రాంచైజీ తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. మీరు కూడా కొత్త సంవత్సరం ప్రారంభించేలోపు ఏదైనా బిజినెస్‌ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం కేవలం అతి తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్‌ చేయవచ్చు. ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 2 లక్షలు సంపాదించవచ్చు. 

1 /10

కొత్త బిజినెస్ ప్రారంభించాలంటే పెద్ద పెట్టుబడి అవసరం అనేది కేవలం ఒక పెద్ద భ్రమ. చిన్న చిన్న ఆలోచనలతో, తక్కువ పెట్టుబడితో కూడా మనం మంచి లాభాలు సంపాదించవచ్చు. మన చుట్టూ ఎన్నో అవసరాలు, సమస్యలు ఉంటాయి. వాటిని గమనించి  వాటికి పరిష్కారాలు కనుక్కోవడం వాటికి వినూత్నమైన బిజినెస్ ఆలోచనలను రూపొందించుకోవచ్చు.

2 /10

 నేటికాలంలో ఉండే  ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి టెక్నాలజీల సహాయంతో మనం మన బిజినెస్‌ను తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, మరింత మందిని చేరుకోవచ్చు. ఎంచుకున్న బిజినెస్‌కు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉంది, మన ప్రత్యర్థులు ఎవరు అనే విషయాలను ముందుగా అర్థం చేసుకుని, మన బిజినెస్‌ను అనుగుణంగా మార్చుకోవచ్చు.

3 /10

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌  అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించే డ్రై ఫ్రూట్స్‌ వ్యాపారం. నేటి మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉండే బిజినెస్‌. ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు సంపాదించవచ్చు. మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఇది బిజినెస్ మీకు బెస్ట్‌. 

4 /10

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియడంతో వాటిని  ఆహారంలో భాగంగా చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

5 /10

డ్రై ఫ్రూట్స్‌ లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది  మంచి కొవ్వులను ఉత్ప్తతి చేస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తున్నాయి.

6 /10

కాబట్టి ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడం ఎంతో బెస్ట్‌ అని చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్స్‌ బిజినెస్‌ను చిన్నగా కూడా ప్రారంభించవచ్చు లేదా పెద్ద షాపును తీసుకొని కూడా స్టార్ట్‌ చేయవచ్చు. చిన్నగా ఈ బిజినెస్‌ను ప్రాంభించాలంటే మీకు కేవలం రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సరిపోతుంది. 

7 /10

మీరు డ్రై ఫ్రూట్స్‌ షాపు పెట్టుకోవాలని అనుకుంటే రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. షాపుకు మంచి స్థలం ఎంచుకోవడం చాలా ముఖ్యం. అది రద్దీగా ఉండే ప్రాంతంలో లేదా మార్కెట్‌లో ఉండాలి. అద్దె, విద్యుత్తు, నీరు వంటి అదనపు ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

8 /10

మీరు ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ అమ్మాలనుకుంటున్నారు? ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి సాధారణ రకాలతో పాటు, వివిధ రకాల నట్స్, ఎండిన పండ్లను కూడా అమ్మడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

9 /10

 డ్రై ఫ్రూట్స్ బిజినెస్‌ కోసం మీరు నైపుణం, విశ్వసనీయ  సరఫరాదారులను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు అమ్మే డ్రైఫ్రూట్స్‌ నాణ్యమైన ప్యాకేజింగ్ కలిగి ఉండాలి.  మీ షాపు గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా, స్థానిక పత్రికలు, ఫ్లైయర్లు వంటి మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగించవచ్చు.  

10 /10

అతి ముఖ్యంగా మీ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన అన్ని లైసెన్సులు, అనుమతులను పొందాల్సి ఉంటుంది.  మీ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న డ్రై ఫ్రూట్స్ షాపుల గురించి తెలుసుకోండి. వారితో పోటీ చేయడానికి మీరు ఏమి చేయవచ్చు అనేది ఆలోచించండి.