Vijay Devarakonda: ఒకే కథతో రెండు ఫ్లాప్స్ కొట్టిన రౌడీ హీరో…ఏవంటే..?

Vijay Devarakonda Movies: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ . ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయినయినా ఆ తర్వాత పలు చిత్రాలలో చేసి మంచి పేరు దక్కించుకున్నారు కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డారని చెప్పవచ్చు. 

1 /6

రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడుతున్నారు.. మరొకవైపు ఆ కథలు, కంటెంట్ ఎలా ఉన్నాయి అని ఆలోచించకుండా సేమ్ కథలతో వచ్చి రెండు డిజాస్టర్ లను చవిచూశాడు విజయ్ దేవరకొండ.   

2 /6

ఇక ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ సినిమా కథ ఏంటి? అసలు ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకుంటారా అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో బొక్క బోర్ల పడింది.   

3 /6

ఇందులో నత్తి ఉన్న అబ్బాయిగా విజయ్ దేవరకొండ నటించారు. ఇకపోతే ఈ చిత్రంలో మైక్ టైసన్ నటించడం ఒక ఎత్తు అయితే ఆయన కూడా ఇందులో కామియో రోల్ చేయడం మరొక ఎత్తు. దీంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. 

4 /6

ఈ సినిమా తర్వాత ఖుషీ సినిమా చేశారు విజయ్ దేవరకొండ. ఇందులో సమంత హీరోయిన్గా నటించింది. ఒక రకంగా చెప్పాలి అంటే సమంత కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని వార్తలు కూడా వినిపించాయి. ఇకపోతే మంచి కథతో రావాలనుకున్న విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

5 /6

లైగర్ ఫ్యామిలీ స్టార్ రెండు సినిమాల కథ ఒకేలాగే ఉండడంతో బెడిసి కొట్టాయని చెప్పవచ్చు. రెండు సినిమాల కథ విషయానికి వస్తే.. హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటారు.. అయితే ప్రత్యర్ధులతో ఫైట్ చేసే సమయంలోనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఇక అటువైపు హీరోయిన్ బాగా రిచ్.. కానీ హీరో అని కావాలనుకుంటుంది. హీరో ఏమో మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక తర్వాత హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి అని అతడిలో ఉండే మైనస్లను బయటకు తీస్తూ ఇన్సల్టింగ్ చేస్తూ ఉంటుంది హీరోయిన్. 

6 /6

ఇక తర్వాత ఒక బిజినెస్ మాన్ సహాయంతో ఎదగాలని చూస్తారు హీరో.. కట్ చేస్తే హీరో కూడా బాగా ఎదిగిపోతారు. చివరికి హీరో ఎదగడానికి ట్రై చేసిన బిజినెస్మేన్ హీరోయిన్ తండ్రి. ఇక తర్వాత హీరోయిన్ కిడ్నాప్ అవ్వడం, హీరోయిన్ ఫాదర్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ తర్వాత హీరో ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడడం.. ఇక అంతే ఎండ్ కార్డు.. ఇలా రెండు సినిమాల్లో కూడా సేమ్ టు సేమ్ కథతో రావడంతో రెండు డిజాస్టర్లు ఎదుర్కొన్నారు విజయ్ దేవరకొండ. మొత్తానికైతే కంటెంట్ విషయంలో తడబడడం వల్లే ఆయన ఇలా వరుస డిజాస్టర్ లను చవిచూస్తున్నారని సమాచారం.