ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ మాక్స్వెల్ భారత సంతతి యువతి వినీ రామన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించింది ఈ జంట. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవానికి జంటగా వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మాక్స్వెల్, వినీ రామన్. తాజాగా ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుని ఎంగేజ్ రింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాక్స్ వెల్.
ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ మాక్స్వెల్ సౌత్ ఇండియా మూలాలున్న వినీ రామన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించింది ఈ జంట. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవానికి జంటగా వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మాక్స్వెల్, వినీ రామన్. తాజాగా ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుని ఎంగేజ్ రింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాక్స్ వెల్.
భారత సంతతికి చెందిన వినీ రామన్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో స్థిరపడింది. వినీ రామన్ మెల్బోర్న్లో ఫార్మసిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఫిబ్రవరి 26న నిశ్చితార్థం చేసుకున్న మ్యాక్సీ, వినీ రామన్‌లు త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ జంటకు క్రికెటర్లు, మ్యాక్స్‌వెల్ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
మ్యాక్స్‌వెల్, వినీ రామన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫొటోలు ఇలా అందించాం. (All Image Courtesy: Instagram)
Next Gallery