Erra Cheera Movie: ఎర్రచీర-ది బిగినింగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్.. గ్రాండ్‌గా త్వరలో ఆడియన్స్ ముందుకు..!

Erra Cheera Release Date: ఎర్రచీర-ది బిగినింగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది. శివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 27న రిలీజ్‌కు ప్లాన్ చేయగా.. బిజినెస్ షో అనంతరం డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు వాయిదా వేశారు. సినిమా అద్భుతంగా ఉందని.. హడావుడిగా కాకుండా శివరాత్రి సీజన్‌లో రిలీజ్ చేయాలని సూచించారు. దీంతో మేకర్స్ కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ కావడంతో ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.
 

1 /5

రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

2 /5

సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ.. తాను కూడా ఓ కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్‌తోపాటు హార్రర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  

3 /5

ఈ సందర్భంగా డైరెక్టర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. మూవీ చూసిన వారందరూ అద్భుతంగా ఉందని చెప్పారని తెలిపారు.   

4 /5

మూవీ ఆలస్యం కావచ్చని.. కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుందని.. అందరూ తప్పకుండా ఆదరించాలని కోరారు.  

5 /5

శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌పై ఎన్‌వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాటోగ్రఫర్‌గా చందు పని చేయగా.. ఎడిటింగ్ బాధ్యతలను వెంకట ప్రభు నిర్వర్తించారు. సంగీతం ప్రమోద్ పులిగార్ల అందించారు.