Brahmamudi Today December 8 Episode: అనామిక దగ్గర ఉన్న కిరీటం ఇనుపది అని సెక్యూరిటీ చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. హే.. ఏంటి నువ్వనేది ఇది నఖిలీదా? అని కంగారుపడుతుంది. అప్పుడే సెక్యూరిటీ నుంచి ఫోన్ లాక్కొంటుంది కావ్య. ఏంటి అనామిక ఇందాక ఫోన్లో ఏదో అన్నావ్ అనగానే షాక్‌గు గురవుతుంది అనామిక.
నీలాంటి శత్రువులు మా కంపెనీని దెబ్బతీస్తావు అని తెలుసు కదా .. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే జీవితంలో కోలుకోలేని గుణపాఠం నేను చెప్పాల్సి వస్తుంది అంటుంది. సెక్యూరిటీతో కావ్య వయస్సులో పెద్దవాడివి కాబట్టి కొట్డడం లేదు. భార్యాపిల్లలు ఉన్నవాడివి కాబట్టి కేసు పెట్టడంలేదు. వెళ్లు అంటుంది కావ్య.మరోవైపు సామంత్‌ను నీవల్ల కాదు కావ్య గురించి తక్కువ అంచనా వేశా అంటాడు ఏమన్నావ్ అని సామంత్ షర్ట్ పట్టుకుంటుంది అనామిక. నేను కూడా నువ్వు చచ్చేవరకు పట్టుకోగలను అని విడిపించుకుని వెళ్లిపోతాడు.
అప్పుడే రాజ్ ఏయ్.. కళావతి అని వస్తాడు. హ.. ఆగండి ప్రతిసారి నన్ను ఎత్తుకుని తిప్పితే కళ్లు తిరుగుతాయి అంటుంది. ఆ డమ్మీ కిరీటం బయట ఎందుకు పెట్టావు? అంటాడు. అందరూ నీలా నిజాయితీగా ఉండరు కదా అంటుంది. వెరీగుడ్ అంటాడు రాజ్.అయితే, ఇంకో సమస్య మిగతా వారాలకు డబ్బుఎలా అంటాడు రాజ్. జగదీష్ గారు ఇచ్చిన రూ.5 కోట్లతో ఏడు వారాలకు సరిపోయే బంగారం కొన్నాంకదా.. అంటుంది కావ్య. కానీ, అకౌంట్ ఇప్పుడు జీరో అయింది కదా అంటాడు రాజ్. ఏదో ఒక దారి దొరుకుతుంది అని ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు.
దుగ్గిరాల వారి ఇంటికి ధాన్యలక్ష్మి మేనమామ వస్తాడు. మాపుట్టింటి తరఫున ఎవరూ రావడంలేదు అంటారు కదా.. ఇప్పుడు ఏమంటారు అంటుంది ధాన్యం. అంతేకాదు మీ ఆయన నాకు ఫోన్ చేశాడు ఎప్పుడో కొన్న గోల్డ్ బిస్కెట్లు ఇవ్వమన్నాడు. రెండేళ్ల క్రితం ఉన్న ధరకు ఇస్తాను అంటాడు. మా రాజ్ రాగానే డీల్ ఓకే చేద్దాం అంటాడు సుభాష్. అది మా పుట్టింటి వారు అంటే అంటుంది ధాన్యం. నేను మీకు మాటిచ్చను కదా అంటాడు, నేను కూడా మాటిచ్చాను కదా అంటాడు ప్రకాశం. అప్పుడే కావ్య రాజ్‌లు వస్తారు. మా పుట్టింటి వారిది కూడా గోల్డ్ బిజినెస్ అని చెప్పాను కదా రాజ్ ఈయన మావయ్య అంటుంది ధాన్యం.
ఎంత పెద్ద మనస్సు కాకపోతే ఇప్పుడు ఉన్న రేటుకు కాకుండా పాత రేటుకు బంగారం ఇస్తా అంటున్నారు రాజ్ అంటుంది ధాన్యం. కానీ, చిన్న మావయ్య మనం బంగారం కొనేశాం. అంత గోల్ట్ మనకు ఇప్పుడు అవసరం లేదు. అంత గోల్డ్ మనకు లాస్లో ఇస్తున్నారు అంటే... అంటుంది కావ్య.ఏమ్మా అంత గోల్డ్ ఎవరికి అవసరం ఉండదు అంటాడు ధాన్యం మేనమామ. సుభాష్ కూడా స్టాక్ కొని పెట్టుకుందాం అంటాడు. నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావ్ అంటాడు ప్రకాశం. ఏరా నువ్వు కూడా నోరు విప్పడం లేదు అంటాడు రాజ్‌ను ప్రకాశం. ఏంట్రా ఎందుకు ఆలోచిస్తున్నావ్ అంటాడు సుభాష్.
అప్పుడే ధాన్యం మేనమామ ఇక చాలు ఆపండి.. మీ ఇంట్లో నువ్వు ఎంత చెబితే అంతా అని గొప్పలు చెప్పావు కదా.. ఈ ఇంట్లో నీ విలువ ఎంతో ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్‌కు కొంటామన్నా మీదగ్గరికి వచ్చాను చూడు ఛీ ఛీ ఏం మనిషివి అని ప్రకాశాన్ని తిడతాడు. ఆగండి మావయ్య అంటుంది ధాన్యం. మీకు గురువింద గింజ అంత మర్యాద లేదు. ఇంకోసారి మీ ఇంటికి పిలిస్తే చచ్చినా రాను అని చెప్పి వెళ్లిపోతాడు.
ప్రకాశం కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కావ్య ఏవండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు రూమ్‌కు వెళ్లండి కాఫీ తీసుకువస్తా అంటుంది. ఆగండి అంటుంది ధాన్యం రాకరాక మా పుట్టింటి నుంచి ఒక్క మనిషి వస్తే పూచిక పుల్లను తీసేసినట్లు తీసేశారు అంటుంది. ప్రకాశం కూడా తక్కువ రేటుకు బంగారం ఇస్తా అంటే ఎందుకు వద్దాన్నావ్ రాజ్, నిన్న కాక మొన్న వచ్చిన కావ్య మాట వింటున్నావ్ అంటాడు. కంపెనీకి సంబంధించిన విషయాలు నువ్వు తీసుకోవాలి కాని మట్టిపిసుక్కునే కావ్యకు ఎందుకు ఇస్తావు బాధ్యత అంటుంది ధాన్యం.
నా పుట్టింటి బలగం ముందు నా పరువు తీశారు అంటుంది. అప్పుడే రుద్రాణీ అప్పుడే ఇలాంటి ప్రేక్షకపాత్ర ఎందుకు పోషిస్తున్నారు. కంపెనీ వ్యవహారాల్లో ఇంటి కోడలు జోక్యం చేసుకుని ఎంత పోగొట్టిందో మీకు ఇంకా అర్థం కావడం లేదా? ధాన్యలక్ష్మికి ఇంత అవమానం జరుగుతుంటే ఓ పెద్ద మనిషి అడ్డుకోలేదు అంటుంది రుద్రాణీ.
నన్ను ఒక మనిషిలా చూస్తే కదా.. అంటాడు ప్రకాశం... ఇప్పటికైనా అర్థమైందా మీకు అంటుంది ధాన్యం. ఆస్తి కావాలి అని ఎందుకు గొడవచేశానో ఇప్పటికైనా తెలిసిందా. మొదటి నుంచి వీరు మనల్ని వేరుగా చూస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎవరు ఎంటని తెలుసుకోండి. రానురాను మనకు ఒక్క ముద్దం అన్నం పెట్టడానికి ఆలోచిస్తారు అంటంది ధాన్యం. కావ్య ఆపండి.. మీరు ఏవేవో అర్థం చేసుకుని ఏమేమో మాట్లాడుతున్నారు. ముందే చెప్పాను కంపెనీకి సంబంధించిన విషయం నేనే నిర్ణయం తీసుకుంటా ఇందులో సంబంధంలేనివారు జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను అని వెళ్లిపోతారు కావ్యరాజ్‌లు.
విన్నారా.. మీరు విన్నారా.. ఈరోజు నా భర్తకు పట్టిన గతి రేపు నాకొడుక్కి పడుతుంది. ఇదంతా నా కర్మ అని సరిపెట్టుకోవాలా? అంటుంది ధాన్యం. ప్రకాశం కూడా ఆవేశంతో వెళ్లిపోతాడు. మా చిన్నన్నయ్యకూడా ఇక మనసైడేఅంటుంది రుద్రాణీ.రాత్రి పెరట్లో సుభాష్ వాకింగ్ చేస్తాడు. ప్రకాశం వచ్చి అన్నయ్య ఈ ఇంట్లో నాకున్న విలువ తెలిసిపోయింది అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ధాన్యలక్ష్మి కావ్యపై ఏం చెప్పినా నమ్మలేదు. ఎందుకుంటే ఏవైనా జరిగితే మాఅన్నయ్య ఉన్నాడు కదా అనే నమ్మకం ఉండేది అంటాడు ప్రకాశం.
కానీ, ఈరోజు నా ఇంట్లో నా భార్య ముందు అవమానం జరిగింది అంటాడు. కావ్య నిన్ను గౌరవిస్తుంది అంటాడు సుభాష్ నా ఇంటికి నేను మంచి చేయాలనడం కూడా తప్పా అంటాడు. నాకు అర్థం కావడంలేదురా..వాళ్లు ఏతప్పు చేయరు అనే నమ్మకం ఉందిరా అంటాడు సుభాష్. ఇక కావ్య నన్ను క్షమించండి మావయ్య అంటుంది ప్రకాశం, రాజ్ అసలు విషయం చెప్పేద్దాం అంటాడు.