అభాగ్యులకు ఆపన్నహస్తం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐతే పేదవారు, రోజూ కూలి  పని చేసుకుని జీవితం గడిపే వారు ఇబ్బంది పడుతున్నారు.

Last Updated : Apr 5, 2020, 10:49 AM IST
అభాగ్యులకు ఆపన్నహస్తం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐతే పేదవారు, రోజూ కూలి  పని చేసుకుని జీవితం గడిపే వారు ఇబ్బంది పడుతున్నారు.

ఐతే అలాంటి వారిని ఆదుకునేందుకు ఎన్నో ఎన్జీవో సంస్థలు ముందుకొస్తున్నాయి. వారి ఆకలి తీర్చేందుకు మేమున్నామంటూ సేవ చేస్తున్నాయి. తెలంగాణలో అలాంటి స్పందన అనే ఎన్జీవో సంస్థ.. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆపన్నులకు, అభాగ్యులకు పట్టెడన్నం పెడుతూ వారి కడుపు నింపుతోంది. రోజూ రెండు పూటలా వారి కోసం ఆహార పదార్థాలు తయారు చేస్తూ పంచుతున్నారు. 

హైదరాబాద్, కరీంనగర్, మెట్ పల్లి, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో రోజూ కనీసం 300 మంది ఆకలి తీరుస్తోంది స్పందన ఎన్జీవో సంస్థ. లాక్ డౌన్ ఉన్నంత వరకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలన్నింటిలోనూ పేద వారికి రోజుకు రెండు పూటలా ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పందన ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా పేదవారికి ఆహారం అందించేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు. అంతే కాదు ఉపాధి కోల్పోయి.. రాబడి లేని వారికి నిత్యావసర సరుకులతోపాటు, కూరగాయలు, పాలు అందిస్తున్నామని చెప్పారు.

'కరోనా వైరస్' మహమ్మారిపై పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించారని సంస్థ ప్రతినిధులు అన్నారు. కాబట్టి.. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని కోరారు. కరోనా  ఉద్ధృతి తగ్గిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. పేదవారు ఎలాంటి ఆందోళన చెందవద్దని .. వారికి ఆహారం అందించేందుకు శాయిశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News