టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తిరగరాశాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 118 పరుగుల చేసి (42 బంతుల్లో 12×4, 10×4) పొట్టి క్రికెట్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కేవలం 34 బంతుల్లోనే 101 పరుగులు చేసిన రోహిత్ ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును కూడా సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ ముందు కాస్త నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన పరుగుల వరదతో ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు.
23 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మరో అర్థ సెంచరీ పూర్తి చేసి శ్రీలంక బౌలర్లతో ఆడుకున్నాడు. అలాగే పెరీరా వేసిన 11వ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి క్రికెట్ అభిమానులను అలరించాడు. టీ20ల్లో తన రెండో సెంచరీని నమోదు చేసిన రోహిత్... చమీరా బౌలింగ్‌లో లాంగ్ షాట్ ఆడబోయి అవుటయ్యే వరకూ.. మైదానమంతా రోహిత్ జపమే చేశారు అతని ఫ్యాన్స్.
టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ హీరో.. 'రోహిత్ శర్మ'