Winter hair care tips: చలికాలంలో బాగా జుట్టు ఊడుతోందా ? హెయిర్ లాస్ అవకుండా ఇలా చేయండి..

చలికాలంలో జుట్టు ఊడే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. అందులోనూ కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. ఈ నెలంతా తెల్లవారుజామున్నే లేచి తలస్నానం చేసి, పూజలు చేసి దీపాలు పెడుతుంటారు. ఇలా ప్రతి రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

  • Nov 27, 2020, 02:10 AM IST

చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే.. అందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. తద్వారా జుట్టు రాలకుండా కాపాడుకోవడంతో పాటు జుట్టు మరింత ఆరోగ్యంనూ చేసుకోవచ్చు. ఆ హెల్త్ టిప్స్ ఏంటో చదివేయండి మరి..

1 /6

1. రోజు తలస్నానం చేయడం వల్ల కొన్నాళ్లకు షాంపూల ప్రభావం ఎక్కువవుతుంది. మాడుపై ఉండే సహజ నూనెలు ( Natural oils on scalp ) పోయి జుట్టు ఎండు గడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత లేదా పీహెచ్ 5.5 ఉన్న నాణ్యమైన షాంపూతో రెండ్రోజులకోసారి తలస్నానం చేస్తే సరిపోతుంది.

2 /6

2. కనీసం వారానికి ఒకసారైనా గోరువెచ్చని స్వచ్చమైన కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకోవడం తప్పనిసరి.

3 /6

3. స్టైలింగ్ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్ వాడడం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్లకు తగిలేలా రాయడం చేస్తుంటారు. కానీ పూర్తిగా ఆరిన తర్వాతే రాయాలి.

4 /6

4. తలస్నానం చేసి వచ్చిన వెంటనే జుట్టు దువ్వుకుంటుంటారు. అలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడే ప్రమాదం ఉంది. పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొని ఆ తర్వాత జెల్స్ రాసుకుంటే ఆ ఇబ్బంది కొంతమేరకు తగ్గించిన వాళ్లు అవుతారు.

5 /6

5. కొందరికి రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. మరునాడు తెల్లవారి లేవగానే తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. జుట్టుకు నూనె రాసుకుని ఆ తర్వాత రెండు గంటలకు తలస్నానం చేయడం మంచిది.

6 /6

6. కొందరు స్టైల్ కోసం జుట్టు అందంగా కనిపించడం కోసం మార్కెట్‌లో లభించే జెల్స్ వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల అప్పటికప్పుడు జుట్టు అందంగా కనిపించినా జుట్టు రాలడం సమస్య ఎదురవుతుంది. రసాయనాలతో కూడిన జెల్స్ వాడకపోవడమే మంచిది.