How to loss weight: అధిక బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి

రాత్రి పూట నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల హాయిగా నిద్ర పట్టడంతో పాటు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

  • Nov 29, 2020, 01:24 AM IST

బెడ్ టైం డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక కేలరీలను కరిగించి కొవ్వును తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఆ హెల్తీ డ్రింక్స్ ఎంటో మీరే చూసేయండి. 

1 /7

కొవ్వును కరిగించే పసుపు పాలు ( Turmeric milk helps to loss weight ) పసుపులో పీచు పదార్థం ఉంటుంది, ఇది బరువు పెరగకుండా నిరోధిస్తుంది అలాగే శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మరింత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. హాయిగా నిద్ర పడుతుంది.

2 /7

కెఫీర్ డ్రింక్‌తో బరువు తగ్గొచ్చు ( Drink Kefir milk to loss weight ) కేఫీర్ అనేది డైరీ మిల్క్ నుండి తయారైన పులియబెట్టిన డ్రింక్. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, శరీర బరువును తగ్గిస్తుంది.

3 /7

కలబంద రసంతో అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు ( Aloe vera juice ) బెడ్ టైమ్‌లో కలబంద రసం తాగడం వల్ల సహజంగా అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4 /7

మెంతి గింజలు నానపెట్టిన నీరు ( Soaked fenugreek water ) మెంతి గింజలు లేదా మెంతులు జీవక్రియను పెంచుతాయి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇది ఆకలిని తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేసి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 /7

బరువు తగ్గడానికి ఉపయోగపడే ( Cinnamon tea to loss weight ) బెడ్ టైమ్‌లో దాల్చిన చెక్క టీ తాగడం వల్ల జీవక్రియను మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అధిక బరువు పెరగడాన్ని కూడా నివారిస్తుంది.

6 /7

డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి  ( Water aids in weight loss ) ఎలాంటి కేలరీలు లేని డ్రింక్ అంటే నీరు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచుతుంది. అంతేకాకుండా ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం వల్ల అధిక కొవ్వు ఉన్న పదార్ధాలను తీసుకోలేరు తద్వార బరువు తగ్గొచ్చు.

7 /7

కాల్షియం, పొటాషియం ఫ్లేవనాయిడ్స్‌తో ఉండే చమోమిలే టీ ( Chamomile tea )  చమోమిలే టీ కాల్షియం, పొటాషియం ఫ్లేవనాయిడ్స్‌తో నిండి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. రాత్రి నిద్రపొయే ముందు ఒక కప్పు వేడి చమోమిలే టీ మనస్సును తేలికపరిచి, మంచి నిద్రకు సహకరిస్తుంది.