మీతో SBI Credit Card ఉందా.. అయితే మీకు భారీగా నగదు గెలిచే సదావకాశం లభించనుంది. ఒకవేళ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులేని వారు అప్లై చేసుకుని కార్డు వచ్చాక వారు సైతం భారీ క్యాష్ ఆఫర్ కోసం ట్రై చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంటే ఖర్చులు చేయడం తప్ప నగదు గెలుచుకోవడం ఏంటనుకుంటున్నారా ఆ పూర్తి వివరాలు మీకోసం.
మీతో SBI Credit Card ఉందా.. అయితే మీకు భారీగా నగదు గెలిచే సదావకాశం లభించనుంది. ఒకవేళ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులేని వారు అప్లై చేసుకుని కార్డు వచ్చాక వారు సైతం భారీ క్యాష్ ఆఫర్ కోసం ట్రై చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంటే ఖర్చులు చేయడం తప్ప నగదు గెలుచుకోవడం ఏంటనుకుంటున్నారా ఆ పూర్తి వివరాలు మీకోసం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న SBI Card Refer and Earn ప్రోగ్రాం కింద డబ్బు సంపాదించవచ్చు. అందుకోసం మీరు కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులను కొత్త SBI Credit Card తీసుకునేందుకు రిఫర్ చేయాల్సి ఉంటుంది.
మీరు చేసిన రిఫరల్ ద్వారా ఎవరైనా కొత్తగా SBI క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే.. ఒక్కో కార్డ్ రిఫరెన్స్‌కు మీకు రూ. 500 మేర వోచర్ లభిస్తుంది. ఇలా నగదు అందించడంతో పాటు తమ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌ను వినియోగదారులకు దగ్గర చేసేందుకు స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పథకం పేరు SBI Credit card Refer and Earn. మీతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉండే మీరు ఓ ఏడాదిలో రూ.25000 వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రస్తుతం చాలా మంది డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులను సైతం విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో SBI తమ క్రెడిట్ కార్డ్స్‌ను మార్కెట్ చేసుకోవడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు, క్రెడిట్ కార్డ్స్ సంఖ్యను పెంచుకునేందుకు రూ. 25000 వరకు మనీ వోచర్స్‌ను అందిస్తుంది. కేవలం స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ పథకం నుండి లబ్ది పొందవచ్చు.
SBI Card Refer and Earn పథకం కింద ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ వినియోగదారుడికి రిఫర్ చేసి క్యాష్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రతి రిఫరెన్స్‌కు రూ.500 అందుకుంటారు. ప్రతి ఒక్కరికీ గరిష్టంగా 50 అవకాశాలు ఉంటాయి. అంటే ఏడాదిలో గరిష్టంగా 50 మందిని రిఫర్ చేసి SBI క్రెడిట్ కార్డు తీసుకునేలా చేస్తే రూ.25000 వరకు అమెజాన్ వోచర్ అందుతుంది. Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు
మీరు పంపిన రిఫరెన్స్ ద్వారా SBI Card Refer and Earn ప్రోగ్రాం కింద ఏవరైరా క్రిడెట్ కార్డ్ తీసుకున్నట్లయితే, SBI Credit Card జారీ అయిన 60 రోజులకు రూ.500 ఓచర్ రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి క్రెడిట్ కార్డుకు జమ అవుతుంది. మీరు ఏదైనా సూచన చేస్తే దాన్ని ఎస్‌బీఐ కండీషన్‌గా అంగీకరిస్తే అందుకుగానూ మరో రూ.500 వోచర్ అందిస్తుంది. అయితే ఈ వోచర్ మాత్రం క్రెడిట్ కార్డు కొత్తగా తీసుకున్న వ్యక్తి తొలి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ జరిగిన 90 రోజుల్లో రూ.500 అమెజాన్ వోచర్ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌కు జమ అవుతుంది. Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి
కొత్తగా క్రెడిట్ జారీ తర్వాత నిర్ణీతకాలానికి రిఫర్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ ఖాతాకు వోచర్ జమ అవుతుంది. ఈ విషయం రిజిస్టర్ అయిన మొబైల్‌కు సమాచారం అందుతుంది. లేనిపక్షంలో ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్‌లో, యాప్‌లోగానీ వోచర్ వివరాలు కనిపిస్తాయి. రిఫరెన్స్‌ను ఆన్‌లైన్ రిఫెరల్ ఫారం లేదా రిఫెరల్ లింక్ ద్వారా మీ సన్నిహితులకు పంపవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో రిఫరల్ కోడ్ పంపించవచ్చు. టెక్ట్స్ మెస్సేజ్, ఈమెయిల్, ఇతరత్రా మార్గాల ద్వారా సైతం రిఫరల్ కోడ్ సెండ్ చేసేందుకు అవకాశం కల్పించారు. Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు
Next Gallery